
మెదడుకు పదును పెడితేనే విజయం
– అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నీ విజేత హైదరాబాద్ కుర్రాడు
– ముగిసిన అంతర్జాతీయ రేటింగ్ చెస్ టోర్నమెంట్
ధర్మవరం అర్బన్ : చదరంగం ఆట మొత్తం మేథాశక్తితో కూడుకున్నది.. మెదడుకు పదును పెడితే విజయం వరిస్తుందని ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కొత్త సత్రంలో శ్రీసత్యసాయి ఫిడే ఇంటర్‌నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. టోర్నీలో ఓపెన్ క్యాటగిరిలో హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు షణ్ముఖతేజ 9 పాయింట్లకు 8.5 పాయింట్లు సాధించి, మొదటి బహుమతి సాధించాడు.
రూ.30 వేల నగదుతోపాటు ట్రోపీని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, టోర్నమెంట్ ఆర్గనైజర్ శింగనమల రామకష్ణ, యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోలా ప్రభాకర్, కార్యదర్శి వై.కె.శ్రీనివాసులు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఈశ్వరప్ప, టెన్నికాయిట్ రాష్ట్ర కార్యదర్శి ముస్తఫ అలీఖాన్, చెన్నేకొత్తపల్లి మండల ఎన్జీవో సంఘం అధ్యక్షుడు నారాయణస్వామి, చీఫ్ అడ్వయిజర్ బీవీ ప్రకాష్, కోచ్ జాకీర్‌హుసేన్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు.
అన్‌రేటెడ్ బహుమతిని ధర్మవరానికి చెందిన నాగశేషుకు రూ.5 వేలు నగదు, ట్రోపీని అందించారు. 13 జిల్లాల క్రీడాకారులతోపాటు 10 రాష్ట్రాల నుంచి 354 మంది చెస్ క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు. మొత్తం బహుమతులు విలువ రూ.2.18 లక్షలుకాగా నగదు బహుమతులు 64 మందికి, 11 ట్రోపీలను యువర్స్‌ఫౌండేషన్ సహకారంతో అందించారు. కార్యక్రమానికి ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ హాజరై మాట్లాడారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుతో కలిసి ఎమ్మెల్యే చెస్ ఆడారు. ప్రథమ బహుమతి షణ్ముఖతేజ (తెలంగాణా), ద్వితీయ బహుమతి సాల్మన్(ఆంధ్రప్రదేశ్), తతీయ బహుమతి పవన్ తేజ (తెలంగాణ), నాల్గవ బహుమతి గౌరవ్‌శర్మ(ఉత్తరప్రదేశ్), ఐదో బహుమతి సూర్యప్రకాష్(తమిళనాడు), ఆరో బహుమతి రంజిత్ కలియరసన్(తమిళనాడు), ఏడో బహుమతి శ్రీశైలం చంద్రమోహన్(ఆంధ్రప్రదేశ్, ధర్మవరం), 8వ బహుమతి కబిల్(తమిళనాడు), 9వ బహుమతి రజత్‌యాదవ్ (మధ్యప్రదేశ్), 10వ బహుమతి విశ్వనాథ్‌కన్నమ్ (తెలంగాణ)లు బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హేమాద్రి, లెక్చరర్ సోమశేఖర్‌ప్రసాద్, పురుషోత్తం, ఆదిరత్నం, గజేంద్రన్ పాల్గొన్నారు.