ఖాళీగా ఉన్న వైద్యాధికారి కుర్చీ
వైద్యాధికారి కనిపించుట లేదు
Published Wed, Aug 17 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరు
ఆగస్టు 9న తీసుకొచ్చిన డీఎంహెచ్‌వో
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
బలిజిపేట పీహెచ్‌సీలో రోగుల అవస్థలు
బలిజిపేట రూరల్: సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించారు. డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. అయినా బలిజిపేట పీహెచ్‌సీ తీరు మారలేదు. రోగులకు అవస్థలు తప్పడం లేదు. 24గంటల పీహెచ్‌సీని పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు జూలై 27న సందర్శించి అసంతప్తి వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోతో మాట్లాడగా వెద్యాధికారిని నియమిస్తున్నట్టు ప్రకటించినా అది మూడురోజుల ముచ్చటైంది. డీఎంహెచ్‌వో శారద ఆగస్టు 9న పీహెచ్‌సీని సందర్శించారు. తనతో పాటు విజయ్‌మోహన్ అనే వైద్యాధికారిని తీసుకువచ్చి ఆయన బలిజిపేట పీహెచ్‌సీలో వైద్యసేవలందిస్తారని అందరికీ పరిచయం చేశారు. ఆ రోజు తరువాత ఇప్పటి వరకు విజయ్‌మోహన్ పీహెచ్‌సీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక రోజు రోగులు రావడం, వైద్యాధికారి కోసం నిరీక్షించడం సర్వసాధారణమైంది. తుమరాడ గ్రామానికి చెందిన త్రినాథ, గడ్డెయ్య, శివడవలసకు చెందిన వి.శాంతి అనారోగ్యంతో బుధవారం బలిజిపేట పీహెచ్‌సీకి వచ్చారు. కానీ వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో నిరాశతో తిరుగుముఖం పట్టారు. వైద్యాధికారి ఉంటే రోజుకు సుమారు 100మంది వరకు రోగులు పీహెచ్‌సీకి వచ్చే అవకాశాలున్నాయి.
ఇదేం పాలన: పార్వతి, బలిజిపేట
నిరుపేదలకు అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 24గంటల పీహెచ్‌సీకి కనీసం ఒక వైద్యాధికారిని నియమించలేకపోవడం దారుణం. నిరుపేదలకు వైద్యం దూరమవుతోంది.
ప్రయివేటు వైద్యమే శరణ్యం: వి.సుబ్బారావు, పీహెచ్‌సీ అభివద్ధి కమిటీ ౖచైర్మన్, బలిజిపేట
ఎమ్మెల్యే చిరంజీవులు, డీఎంహెచ్‌వో శారదలు ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటివరకు వైద్యాధికారిని నియమించలేదు. రోగులకు ప్రయివేటు వైద్యమే దిక్కవుతోంది. పీహెచ్‌సీకి తాళాలు వేసుకోవడమే తప్పా వేరే మార్గం కనిపించటం లేదు.
Advertisement
Advertisement