పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు | Irrigation officials examined pylon | Sakshi
Sakshi News home page

పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

Published Sun, Jul 24 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

వరంగల్‌ : మిషన్‌ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారనే సమాచారం మేరకు సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయప్రకాశ్, సీఈ నాగేందర్‌ శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు హన్మకొండలోని మైనర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో నిర్మించిన మిషన్‌ కాకతీయ పైలాన్‌ను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్‌ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోషి మాట్లాడుతూ పైలాన్‌ పరిసర ప్రాంతాలతో పాటు కార్యాలయ ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఆగస్టు 8వ తేదీన ప్రధాని పైలాన్‌ ఆవిష్కరణ కోసం వచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రధాని పర్యటన మరో వారం రోజుల్లో ఖరారవుతుందన్నారు. అనంతరం వారు హరితహారంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.
చెరువుల సందర్శన
మిషన్‌ కాకతీయలో చేపట్టిన ¿¶ ద్రకాళి, బంధం చెరువుల అభివృద్ధి పనులను సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయప్రకాశ్‌ పరిశీలించారు. అలాగే హసన్‌పర్తిలోని పెద్ద చెరువును కూడా వారు సందర్శిం చారు. కాగా, హసన్‌పర్తి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఉన్నతాధికారులను కోరారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో గత మూడేళ్లుగా ఆగిన ప్యాకేజీ–3 పనులను కూడా వారు పరిశీలించారు. అక్కడి నుంచి ధర్మసాగర్‌ పంప్‌హౌస్‌ను సందర్శించి హైదరాబాద్‌కు వెళ్లారు. దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్‌ఈ శ్రవణ్, ఈఈలు గోపాలరావు, రత్నం, రాంగోపాల్,  ఎన్‌టీపీఏ విశ్వంభరచారి, డీఈఈలు రఘుపతి, కిరణ్, పూర్ణచందర్, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement