Pylon
-
వివాదాస్పదమైన పైలాన్ ఆవిష్కరణ
కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం : యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం సీతంపేట వద్ద నారా లోకేశ్ ఆవిష్కరించిన పైలాన్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాదయాత్ర 200వ రోజుకు చేరిన నేపథ్యంలో సీతంపేటలో పైలాన్ నిర్మించారు. ఈ సందర్భంగా 35 అడుగుల ఎత్తులో లోకేశ్ ఫొటోతో కూడిన మెటల్ పైలాన్‌ను ఏర్పాటుచేశారు. చిత్రపటంలోని లోకేశ్ కాళ్ల వద్ద పూర్ణకుంభాన్ని ఉంచి పూజలు నిర్వహించి పైలాన్‌ని ప్రారంభించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమం నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. అంబులెన్స్‌కు దారి ఇవ్వని తమ్ముళ్లు యువగళం పాదయాత్ర పేరిట లోకేశ్ గురువారం చేపట్టిన కార్యక్రమం ఏలూరు జిల్లా నరసన్నపాలెం వై.జంక్షన్ నుంచి పొంగుటూరు వరకు కొనసాగింది. పాదయాత్ర కొనసాగుతుండగా అంబులెన్స్ వాహనాలకు తెలుగు తమ్ముళ్లు దారి ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలు పోలీసుల సహాయంతో మార్గం సుగమం చేశారు. అలాగే, పాదయాత్రలో లోకేశ్‌తోపాటు తల్లి భువనేశ్వరి విక్టరీ సింబల్ కాకుండా కామ్రేడ్స్ మాదిరిగా పిడికిలి బిగించి అభివాదం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బూచోడిలా లోకేశ్.. పాదయాత్రలో ఓ ఆసక్తికర ఘటన కూడా చోటుచేసుకుంది. బయ్యనగూడెం సమీపంలో రామకోనేరు వద్ద ఓ మహిళ తన చిన్నారితో నిలబడి ఉండగా.. లోకేశ్ వారి వద్దకు వెళ్లి బూచోడు మాదిరిగా హావభావాలు ప్రదర్శించారు. దీంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. ఆ తర్వాత స్థానికులు వైఎస్ జగన్ చిన్నారులపట్ల చూపించే ఆప్యాయత గురించి చర్చించుకుంటూ లోకేశ్‌పై ఛలోక్తులు విసరడం కనిపించింది. మరోవైపు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు సీతంపేటలో లోకేశ్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. అలాగే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దగ్థంచేశారు. -
మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్ శ్రీకారం
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయనకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్ యాడ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పైలాన్ బాలుర ప్రభుత్వం పాఠశాలలో ఆవిష్కరించారు. చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సీఎం సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు ‘‘వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో ఏర్పాటవుతాయన్నారు. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బడి.. బాగు.. కాగా, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
చిత్తూరు: సీఎం జగన్ ఇళ్ల పట్టాల పైలాన్ ఆవిష్కరణ
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సోమవారం ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి.. వైఎస్సార్ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతోందని అన్నారు. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోమవారం శ్రీకారం చుట్టారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు. -
ఇలాంటి పాదయాత్ర దేశంలో ఎవరు చేయలేదు
-
అందరి దృష్టి గజ్వేల్‌పైనే..
రేపు ఆవిష్కృతం.. ప్రధాన ఘట్టం అద్భుత ఘట్టానికి మిగిలింది ఒక్క రోజే సభపై జాతీయ స్థాయిలో ఆసక్తి కేసీఆర్ ‘భగీరథ’ యత్నం... ఫలించబోతున్న క్షణాలపై ఉత్కంఠ పూర్తి కావచ్చిన ప్రధాని సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌రావు గజ్వేల్:అద్భుత ఘట్టానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది... ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ తొలి పర్యటనకు ఒక్క రోజే మిగిలి ఉంది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాబోతున్న ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’... ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్న క్షణాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. గజ్వేల్ మండలం కోమటిబండలో ఈనెల 7న మధ్యాహ్నం నిర్వహించబోతున్న ప్రధాని సభకు ఒకే రోజు మిగిలి ఉండటంతో.. దాదాపుగా ఏర్పాట్లను పూర్తికావచ్చాయి. సభావేదిక, గుట్టపై హెడ్ రెగ్యులేటరీ వద్ద మిగిలిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్‌తో కలిసి సభావేదిక సమీపంలో నెంటూర్ రోడ్డు వైపున ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగగానే... రాష్ట్ర యంత్రాంగం ప్రధానితోపాటు సీఎంకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. కార్యక్రమ వివరాలిలా... గుట్టపై గల హెడ్ రెగ్యులేటరీ వద్ద 7వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరిస్తారు. పక్కనే గల నల్లా, పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. సుమారు 7నుంచి 10 నిమిషాలపాటు ప్రధాని ఇక్కడ గడిపే అవకాశముంది. గుట్టపై నుంచి కిందికి దిగగానే బహిరంగ సభ స్థలిలోని ప్రధాన వేదిక వెనుక భాగంలో మరో ఐదు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రధాని వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రధాని ప్రసంగించే వేదికను మూడు భాగాలుగా విభజించారు. ప్రధాన వేదిక మోదీతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర వీవీఐపీలు ఉంటారు. దీనికి ఎడమ వైపున కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, కుడి వైపున కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారు. మరోవైపు కళాకారుల కోసం వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఓబీ వ్యాన్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని ఈ గ్యాలరీలో కేటాయించారు. 160 ఎకరాల్లో పార్కింగ్ పార్కింగ్ కోసం 160 ఎకరాలు కేటాయించారు. 8 ఎకరాలకు ఒక సెక్టార్ చొప్పున 20 సెక్టార్లుగా విభజించారు. వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఇతర ప్రముఖుల కోసం కూడా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు వేల ఆర్టీసీ బస్సులను వినియోగించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని డిపోల నుంచి జనాలతో రానున్నాయి. మరో వెయ్యి ప్రైవేట్ బస్సులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. బస్సులను నిలిపేందుకు ఇబ్బంది కాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అగ్ని మాపక యంత్రాలు... లైటింగ్, సౌండ్ సిస్టమ్, జనరేటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే... వినియోగించుకునేలా 50 అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచనున్నారు. గట్టి నిఘా.. ప్రధాని వచ్చే హెలిపాడ్ ప్రదేశం నుంచి హెడ్‌రెగ్యులేటరీ, సభావేదిక ప్రాంతంలో నిఘా కొనసాగించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హెడ్‌రెగ్యులేటరీ ప్రదేశానికి మీడియాను అనుమతించడం లేదు. అక్కడ ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని... దూరదర్శన్ సహకారంతో అందించడానికి అససరమైన ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై ముందుగా రాష్ట్ర ప్ర«భుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇది పూర్తయ్యాక.. ప్రధాని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పరిశీలించిన మంత్రి కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం పర్యవేక్షించారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేసీ వెంకట్రామ్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతకుముందు హెలిపాడ్‌ను పరిశీలించారు. పనులు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత హెడ్‌రెగ్యులేటరీ వద్ద పైలాన్ తుది దశ పనులను పరిశీలించారు. ఇదే ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్, ఫొటోఎగ్జిబిషన్ ఏర్పాట్లను సైతం చూశారు. ఆ తర్వాత సభాస్థలికి చేరుకుని వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. పార్కింగ్ స్థలాలపై ఆరా తీశారు. ఇక్కడే ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ప్రధాని తెలంగాణ తొలి పర్యటన దిగ్విజయం చేసి చరిత్రలో నిలిచిపోవాలన్నారు. -
పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
వరంగల్ : మిషన్ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారనే సమాచారం మేరకు సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ విజయప్రకాశ్, సీఈ నాగేందర్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు హన్మకొండలోని మైనర్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన మిషన్ కాకతీయ పైలాన్‌ను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోషి మాట్లాడుతూ పైలాన్ పరిసర ప్రాంతాలతో పాటు కార్యాలయ ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఆగస్టు 8వ తేదీన ప్రధాని పైలాన్ ఆవిష్కరణ కోసం వచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రధాని పర్యటన మరో వారం రోజుల్లో ఖరారవుతుందన్నారు. అనంతరం వారు హరితహారంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. చెరువుల సందర్శన మిషన్ కాకతీయలో చేపట్టిన ¿¶ ద్రకాళి, బంధం చెరువుల అభివృద్ధి పనులను సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ విజయప్రకాశ్ పరిశీలించారు. అలాగే హసన్‌పర్తిలోని పెద్ద చెరువును కూడా వారు సందర్శిం చారు. కాగా, హసన్‌పర్తి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ ఉన్నతాధికారులను కోరారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో గత మూడేళ్లుగా ఆగిన ప్యాకేజీ–3 పనులను కూడా వారు పరిశీలించారు. అక్కడి నుంచి ధర్మసాగర్ పంప్‌హౌస్‌ను సందర్శించి హైదరాబాద్‌కు వెళ్లారు. దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్ఈ శ్రవణ్, ఈఈలు గోపాలరావు, రత్నం, రాంగోపాల్, ఎన్టీపీఏ విశ్వంభరచారి, డీఈఈలు రఘుపతి, కిరణ్, పూర్ణచందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అన్నీ ఆవిష్కరణలే
హ చిలకలూరిపేటలో రూ.517.51 కోట్ల పనులకు పునాది హ హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పర్యటన గురువారం ‘అన్నీ ఆవిష్కరణలే’ అన్నట్టుగా సాగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం రూ. 517.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పైలాన్లు ఆవిష్కరించారు. తొలుత హెలికాప్టర్ దిగిన సీఎం, కేంద్రమంత్రి పురుషోత్తమపట్నం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్డిని పరిశీలించారు. రూ.23.08 కోట్లతో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్ పథకం’కు సంబంధించిన పైలాన్‌ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా ప్రకటించారు. శారద హైస్కూల్ రోడ్డులో రూ.1.40 కోట్లతో ఆధునికీకరించిన శ్మశానవాటిక శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవన సముదాయాన్నీప్రారంభించారు. పట్టణ మౌలిక వసతులు, మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ.143 కోట్లతో చేపట్టనున్న పనుల కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలి... ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద రూ.248.16 కోట్లతో 52.66 ఎకరాల్లో 4,512 జీప్లస్ -3 గృహ నిర్మాణ పనులకు సంబంధించి నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దీని పక్కనే రూ. 15 కోట్లతో చేపట్టే కల్చరల్ అకాడమీ హాలు, రూ.2.16 కోట్లతో శ్మశానాల అభివృద్ధి పనులు, 13వ ఆర్థిక సంఘం, ప్రణాళిక, ప్రణాళికేతర, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, మున్సిపల్ నిధులతో రూ.20.16 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకు లింకేజీ రుణాలు రూ.65.95 కోట్లకు సంబంధించిన చెక్కును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. రూ. 45 కోట్లు కేటాయించాలి : మంత్రి ప్రత్తిపాటి సీఎం కాన్వాయ్ కళామందిర్ సెంటర్‌కు చేరుకోగానే మక్కామసీదు వద్ద వేచి ఉన్న అంజుమన్ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని వెండి కిరీటాలతో సత్కరించారు. అండర్ డ్రైనేజీ విధానానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో 33 గ్రామాలకు మంచినీటి కొరత లేకుండా చే సేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా కోరారు. -
పోర్టుజాడ.. నీలినీడ
బందరు పోర్టు నిర్మాణానికి పట్టిన గ్రహణం వీడడం లేదు. 2008లో పైలాన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలుత స్థల సేకరణ, ఆ తర్వాత పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద వద్ద క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో పోర్టు నిర్మాణానికి లంగరు పడినట్లయింది. ఇది మచిలీపట్నంలో పోర్టు నిర్మించే ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో భద్రతాపరమైన ఆంక్షలు విధిస్తారేమోనన్న నీలినీడలు కమ్ముకున్నాయి. -
వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్
మాడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సిద్దిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను విజయవంతం చేస్తామని ప్రకటించారు. వాటర్ గ్రిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ35 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్షం అన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
’ఏపీని నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతా’
-
విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేడు కేసీఆర్ శంకుస్థాపన ♦ 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం ♦ ప్రాజెక్టు వ్యయం రూ. 17,650 కోట్లు ♦ నాలుగేళ్లలో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు పడనుంది. నల్లగొండ జిల్లాను తెలంగాణ విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృష్ణా నదీతీరంలో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5:05 నిమిషాలకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం 5:50 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకుంటారు. ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అంతకంటే ముందు హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన చౌటుప్పల్‌కు సాయంత్రం 4:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల వెళ్లి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి నల్లగొండకు వస్తారు. రాత్రి 7:10 నిమిషాలకు బహిరంగసభలో పాల్గొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటనకుగాను అధికార, టీఆర్ఎస్ వర్గాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జెన్ కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో... నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టెలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం అటవీరేంజ్ పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్‌ను జెన్కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో రూ.17,650 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కూడా కుదిరింది. ప్లాంట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం ఐదు టర్బైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టర్బైన్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో రెండు టర్బైన్లను మూడేళ్లలో, మరో మూడింటిని నాలుగేళ్లలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందిం చారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 10 వేల ఎకరాల అటవీ భూములను సేకరించాలని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత 6 వేల ఎకరాలనే తీసుకున్నారు. ఇందుకుగాను అంతే భూమిని అటవీశాఖకు బదలాయించడం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి కూడా లభించడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాకు చెందిన జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ మంత్రిగా ఉండటంతో ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రూ.1.9 కోట్లతో వాటర్‌గ్రిడ్ పైలాన్ రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ నిర్మాణానికి రూ.1.9 కోట్లు ఖర్చు చేశారు. పైలాన్ చుట్టూ తెలంగాణలోని పది జిల్లాలకు ప్రతిబింబాలుగా 10 బతుకమ్మలను కూడా ఏర్పాటు చేశారు. పైలాన్ ఆవిష్కరణకు ప్రధాని మో దీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం తొ లుత భావించినా ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. -
చురుగ్గా ‘థర్మల్’పైలాన్ నిర్మాణం
వీర్లపాలెం (దామరచర్ల) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని వీర్లపాలెం గ్రామ శివారులో జెన్కో సంస్థ నిర్మిస్తున్న పైలాన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 5 ఎకరాల స్థలంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. పనులను ఖమ్మం కేవీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. పనుల పరిశీలనకు జెన్కో ఈఈ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఆదిలో అడ్డంకులను అధిగమించి.. ఆదిలో అడ్డంకులను అధిగమించి....థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలోని అటవీభూములు 10,500 ఎకరాలు సర్వే చేయించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి నివేదిక పంపింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణానికి 4676 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్యులు జారీ చేసింది. దీంతో జెన్కో అధికారులు స్థానిక అధికారులకుగానీ, నాయకులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఇటీవల తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామస్తులు తమకు నష్టపరిహారం విషయంలో హామీ ఇవ్వకుండా పైలాన్ పనులు ఎలా చేపట్టారని కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నిచర్‌ను తగులబెట్టిన విషయం విదితమే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో కదలికవచ్చి ఆర్టీఓ కిషన్‌రావు, డీఎస్పీ గోనె సందీప్‌ను గ్రామస్తులతో సమావేశపరిచి వారికి నచ్చజెప్పి ఆటంకాలను అధిగమించేలా చేశారు. రోజూ మూడు టీంలు దీంతో నాలుగు రోజులుగా పనులు వేగవంతం చేశారు. నిర్మాణానికి రోజూ మూడు టీంల తాపీ మేస్త్రీలు, కూలీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చకచకా కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 18 గంటలు, సుమారు వంద మంది కూలీలతో పైలాన్ పనులను నిర్వహిస్తున్నారు. పరిశీలనకు జెన్కో ఈఈతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి జెన్కో డీఈ దాస్, ఏఈ నాగరాజును డిప్టేషన్పై ఇక్కడ నియమించారు. ఈ నెల చివరిలోగా నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, అన్ని అనుకూలిస్తే అనుకున్న సమయంలో పూర్తిచేస్తామని ఈఈ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైలాన్ చేరని వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రణాళికా లోపం, నిధుల కొరతతో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఆరంభానికి ముందే ఎదురీదుతోంది. టెండర్లకు ముందే ఆరోపణలు.. పునాది రాయి అయినా వేయక ముందే విపక్షాలు చేస్తున్న విమర్శలు వాటర్‌గ్రిడ్‌ను ముసురుకున్నాయి. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన బృహత్తర లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్టు పనులన్నీ నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి. పైపులైన్ల టెండర్లకు ఒత్తిళ్లు: వాటర్ గ్రిడ్‌కు రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇందులో కీలకమైన పైపుల తయారీ.. కొనుగోలు.. లైనింగ్ ప్రక్రియపై బడా కంపెనీలన్నీ కన్నేశాయి. తెలంగాణ, ఏపీ కంపెనీలతో పాటు జిందాల్, కొరియన్ వాటర్ కంపెనీ ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఐసీఐసీఐ, ఎల్ఐసీతో కన్సార్టియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఈ పైపులైన్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతోంది. కొరియన్ వాటర్ కంపెనీ సైతం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బడా కంపెనీలన్నీ రాష్ట్ర సర్కారుపై రాజ కీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్న ప్రచారం జోరందుకుం ది. అయితే పైపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు. ఈలోగా కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా టెండర్ల నిబంధనలుండేలా పైరవీలు చేస్తుండటంతో సర్కారు తల పట్టుకుంది. నిధు ల సమీకరణకు వీలు గా రాష్ట్ర సర్కారు జనవరిలోనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ.. కార్పొరేషన్‌కు సంబంధిం చిన పాలకవర్గం నియామకాలు కాలేదు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్ తుదిదశలో ఉంది. ఇప్పటికీ కార్యక్రమానికి పునాది రాయి పడలేదు. ఈలోగానే విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటేక్ వెల్స్కు సంబంధించిన ప్యాకేజీల కుదింపు, టెండర్లవ్యవధి తగ్గింపు.. టెండరు మార్గదర్శకాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చినట్లు విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి. దీంతో పనుల వేగానికి కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది. సర్వేకే ఆరు నెలలు వాటర్‌గ్రిడ్ తొలిదశ లైన్ సర్వే ఇటీవలే పూర్తయింది. నెల రోజుల్లో పూర్తవుతుందనుకున్న సర్వే కు ఆరు నెలలు పట్టింది. లైన్సర్వేకు లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్) వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని విని యోగిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఖరీదైన ప్రక్రియ కావటంతో వెనకడుగు వేసింది. -
29న ‘మిషన్ కాకతీయ’ పైలాన్ ఆవిష్కరణ
వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మిస్తున్న పైలాన్‌ను ఈనెల 29న అవిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమా భారతి వస్తున్నట్లు అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందించడంతో పనులు వేగవంతమయ్యాయి. ఈనెల 6వ తేదీన పైలాన్ నిర్మాణం ప్రారంభం కాగా, సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ పనుల్లో ఎలాంటి జాప్యం జరుగలేదు. మరో మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 22 నాటికి పైలాన్ ఆవిష్కరణకు సిద్ధం చేస్తామని ఉన్నతాధికారులకు జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు. దేశంలోనే చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినందున కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 26న గణతంత్ర దినోత్సవం ఉన్నందున 29వ తేదీన పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ఉమాభారతి అంగీకారం తెలిపినట్లు సమాచారం. -
విజయ ప్రస్థాన పైలాన్‌ను ఆవిష్కరించిన షర్మిళ, విజయమ్మ