మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్‌ శ్రీకారం | CM KCR Inaugurated Mana Ooru Mana Badi Pylon In Wanaparthy District | Sakshi
Sakshi News home page

మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్‌ శ్రీకారం

Published Tue, Mar 8 2022 3:00 PM | Last Updated on Tue, Mar 8 2022 3:55 PM

CM KCR Inaugurated Mana Ooru Mana Badi Pylon In Wanaparthy District - Sakshi

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయనకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్ యాడ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పైలాన్ బాలుర ప్రభుత్వం పాఠశాలలో ఆవిష్కరించారు.

 చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సీఎం సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు ‘‘వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌లో చాలా చ‌క్క‌టి వ‌స‌తులు పాఠ‌శాల‌ల్లో  ఏర్పాటవుతాయన్నారు. భ‌విష్య‌త్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చదవండి: బడి.. బాగు..

కాగా, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement