గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్నారా? | Is the grain storage in warehouse? | Sakshi
Sakshi News home page

గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్నారా?

Published Sun, Sep 11 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

గోదాంలో వరి ధాన్యం నిల్వ

గోదాంలో వరి ధాన్యం నిల్వ

  • అయితే ఎలుకలతో జాగ్రత్త.. నివారణ తప్పనిసరి
  • గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌
  • గజ్వేల్‌: ధాన్యం నిలువ చేసుకునే గోదాముల్లో ఎలుకల వల్ల రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎలుకల వల్ల నష్టపోయి కుంగిపోతున్నారు. వీటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ (సెల్‌ నెం : 7288894469) సూచించారు. ఈ అంశంపై ఆయన అందించిన సలహాలు... సూచనలివి.

    • గోదాముల్లో ఎలుకలు చొరబడకుండా ఉండాలంటే మురుగు కాలువలు, గోడల కింది భాగంలో ఉండే రంధ్రాలు, చెత్త కుప్పలు లేకుండా జాగ్రత్త పడాలి.
    • చెట్టు కొమ్మలు, కరెంటు, టెలిఫోన్‌, కేబుల్‌ వైర్లు గోదాముల సముదాయంపై వెళ్లకుండా చూసుకోవాలి.
    • కిటికీలు, వెంటిలెటర్లు, మురుగు వెళ్లే పైపులకు జాలి బిగించినట్లయితే ఎలుకల ప్రవేశాన్ని అరికట్టవచ్చు.
    • తలుపుల కింది భాగం నుంచి 25సెంటీమీటర్ల ఎత్తు వరకు ఇనుప షీట్‌ ఏర్పాటు చేయాలి.
    • ఎలుక కన్నాలు, మలవిసర్జన, మూత్ర విసర్జన, ఎలుక వెంట్రుకల ద్వారా వచ్చే వాసనను బట్టి ఎలుక ఉన్నట్లుగా గుర్తించాలి. ఎలుక కన్నాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని సిమెంటు లేదా కాంక్రీటుతో మూసివేయాలి.
    • గోదాముల చుట్టుపక్కల చెత్తా చెదారం, చెక్క ముక్కలు, ఇటుకల సముదాయం లేకుండా చూసుకోవాలి.
    • మిగిలిపోయిన ఆహారం, ఆహారపు పొట్లాలు గోదాముల చుట్టు పడేయరాదు.
    • రసాయనక విషపు ఎరలు మాత్రమే ఎలుకల నివారణకు అందుబాటులో ఉన్నాయి. ఈ రసాయనిక ఎలుక మందులను ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలకు ఎక్కువగా ఆకర్షించబడి నష్టపరుస్తాయి.
    • విషపు ఎరలను సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళల్లో ఉంచినట్లయితే రాత్రిళ్లలో  ఎలుకలు తిని చనిపోవడానికి వీలుంటుంది. విషపు ఎరను బయట ప్రదేశాల్లో ఉంచకుండా ఎరకు ఉపయోగించే బోన్లు వాడినట్లయితే ఇతర జీవరాశులు ఈ విషపు ఎరను  తినకుండా జాగ్రత్త పడవచ్చు.
    • ఎలుకలు తిరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ఎరను ఉంచినట్లయితే మంచి ఫలితముంటుంది.

    జింక్‌ పాస్ఫైడ్‌ ఎర:  
    జింక్‌ పాస్ఫైడ్‌ బూడిద నలుపురంగులో ఉండి వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. ఇది వేగంగా పనిచేసే ఎలుకల మందు. మందు తిన్న 24గంటల్లో ఎలుకలు చనిపోతాయి. ఈ జింక్‌ పాస్ఫైడ్‌ గోదాములు, ఇళ్లు, షాపులు, పొలాలు, ఇతర ప్రదేశాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఈ మందు వాడేముందు ఎలుకలను మచ్చిక చేసుకోవడం తప్పనిసరి.

    ఇందుకోసం ముందుగా నూకలు, నూనె కలిపి ఎలుకలకు ఎరగా వేయాలి. ఈ విధంగా రెండు నుంచి మూడు రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వంద గ్రాముల నూకలకు 2.5గ్రాముల జింక్‌ పాస్ఫైడ్‌, తగినంత వంటనూనె చేర్చి విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10గ్రాముల చొప్పున ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement