ఉయ్యాలవాడ జీవితం యువతకు స్పూర్తిదాయకం | jagadishwar reddy Kethireddy applauds uyyalawada | Sakshi
Sakshi News home page

ఉయ్యాలవాడ జీవితం యువతకు స్పూర్తిదాయకం

Published Sun, May 21 2017 11:15 PM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

ఉయ్యాలవాడ జీవితం యువతకు స్పూర్తిదాయకం - Sakshi

ఉయ్యాలవాడ జీవితం యువతకు స్పూర్తిదాయకం

తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
ఒంగోలు :
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా చిత్రాన్ని నిర్మించడం ఆనందదాయకమని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ జీవితం యువతకు స్పూర్తిదాయకమని కేతిరెడ్డి పేర్కొన్నారు. భారతీయుల సత్తా ఎలాంటిదో ఆంగ్లేయులకు చూపించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. ఒంగోలులో నిర్వహించిన ఉయ్యాలవాడ స్మారక సభలో కేతిరెడ్డి మాట్లాడారు.

ఈ నెల11న స్వాతంత్ర్య సమయరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళి అర్పించేందుకు చెన్నై నుంచి కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడ వరకు  చారిత్రక స్మారక యాత్ర చేశామని కేతిరెడ్డి తెలిపారు. తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడి చరిత్ర ప్రజలందరికి ఆదర్శం కావాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జాతీయ వీరుడిగా గుర్తించాలని, ఉయ్యాలవాడ పేరుతో పోస్టల్‌ స్టాంపు విడుదల చేయాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement