జగన్మాత నమోనమః
బద్వేలు అర్బన్: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఆలయాలలో అమ్మవారు విశేష పూజలందుకుంటూ కొలువు దీరారు. 7వ రోజైన శుక్రవారం వాసవి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు బిల్వవృక్షవాసవీదేవి జగన్మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఈ ఆలయంలో నిర్వహించిన తోటోత్సవం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. శుక్రవారంతో పాటు తోటోత్సవం నిర్వహిస్తుండటంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అలాగే స్థానిక మహాలక్ష్మిదేవి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణతులాభారం కూడా నిర్వహించారు. అలాగే కోదండరామస్వామి ఆలయంలో శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రంగనాధ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అలాగే వీరభద్రస్వామి దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వీటితో పాటు మడకలవారిపల్లెలోని సుదర్శన ఆశ్రమం, పోలీసు స్టేషన్ ఆవరణలోని దుర్గమ్మ ఆలయాలతో పాటు గాలిదేవర్ల ఆలయంలోని అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ , ప్రసాదాలు అందజేశారు.