జమలాపురం ఆలయంలో ఉత్సవ మూర్తులు, పవిత్రాలను యాగశాలకు తీసుకెళ్తున్న అర్చకులు
ఎర్రుపాలెం:
తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాలకు ధారణ గావించనున్న పవిత్రాలు, శ్రీస్వామివారి, శ్రీ అలివేలుమంగ, శ్రీ పద్మావతి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలకు తీసుకొచ్చారు. గణపతిపూజ, పుణ్యహవచనం, కలశస్థాపన, అగ్నిమథనం చేశారు. హోమం, వాస్తు, తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను గరుడవాహనంపై కూర్చోబెట్టి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారు, అమ్మవార్లకు వాహన సేవ నిర్వహించారు. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ రమణమూర్తి, చైర్మన్ ఉప్పల శివరామప్రసాద్, దేవస్థానం ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సాధు విజయకుమారి, జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు పాల్గొన్నారు.