
లోక రక్షకుడు యేసు
కప్పట్రాళ్ల(దేవనకొండ) : లోక రక్షకుడు జీసస్ అని, ఆయనను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం ఎస్పీ కుటుంసభ్యులు కప్పట్రాళ్ల గ్రామస్తుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ముందుగా ఎస్పీ దంపతులు కేక్‌ను కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యేసు జననం, మరణం మానవాళి శ్రేయస్సుకే జరిగిందన్నారు. ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తోటి వారిని గౌరవించాలన్నారు. క్రైస్తవులు హిందువులను, ముస్లింలను కలుపుకుని పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా గ్రామం నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో చర్చి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీచ్చారు. అనంతరం ఎస్పీ దంపతులు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల లక్ష్మన్నమాదిగ స్వగృహంలో భోజనం చేశారు. కార్యక్రమంలో పత్తికొండ సీఐ విక్రమ్‌సింహా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.