జీతాలివ్వండి మహాప్రభో!
Published Tue, Jul 26 2016 11:59 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
► ఐదునెలలుగా ఎంపీఈఓలకు జీతాలు కరువు
► తీవ్ర ఇబ్బందుల్లో ఉద్యోగులు
శింగనమల :
నియోజక వర్గంలో శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 48 మంది ఎంపీఈఓలు వ్యవసాయశాఖలో పని చేస్తున్నారు. అందులో 24 మంది ఏప్రిల్ నుంచి కొత్తగా విధులలోకి చేరారు. ఎంపీఈఓలకు వ్యవసాయ శాఖలో పరిధిలో వేరుశనగ విత్తనాలు పంపిణీæ, క్రాఫ్ బుకింగ్, గ్రామ స్కెచ్‌లు తయారు చేయడం, రైతులతో సమావేశాలు నిర్వహించడం, వారికి అవగాహన కల్పించడం ,మట్టి నమునాలు సేకరించడం, వాటిని రైతులకు అందజేయడం వంటి పనులు చేస్తున్నారు
అందని జీతాలు
పాత ఎంపీఈఓలకు ఫిబ్రవరి నుంచి, కొత్త వారికి ఏప్రిల్ నుంచి జీతాలు రాలేదు. శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని 14 మందికి మాత్రమే జీతమిచ్చారు. బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పని చేస్తున్న 34 మందికి జీతాలు రాలేదు. వీరిలో పాత వారు 17 మంది ఉంటే కొత్తగా చేరినవారు 17 మంది ఉన్నారు.
నాలుగు మండలాల్లో పని చేస్తున్న ఎంపీఈఓలకు రూ. 10.88 లక్షలు జీతాలు రావాల్సి ఉంది. పాత వారికి ఒక్కొక్కరికీS రూ.40 వేలు, కొత్త వారికి ఒక్కొక్కరికీ రూ.24 వేలు జీతాలు రాలేదు. జీతాలు ఇవ్వకపోవడంతో ప్రయాణ ఖర్చులతో పాటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని పలువురు ఎంపీఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీఈఓల జీతాలు ట్రెజరీకి అందించాం
ఎంపీఈఓల జీతాల విషయాన్ని ఏడీ దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వారి బిల్లులు ట్రెజరీకి పంపించారు. ఈనెలాఖరులోపు వారి బ్యాంక్ ఖాతాలకు జీతాలు జమ అవుతాయి.
– ఆంజినేయులు, ఏఓ,యల్లనూరు
Advertisement