జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీయూడబ్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చారామలింగారెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం గురువారం కలెక్టరేట్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. సంఘం అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు, మీడియా ఎంప్లాÄæూస్, చిన్నపత్రికల సంఘాలు, సబ్ ఎడిటర్స్ ఫోరం నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాలకు, కులాలకు పోటీపడి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పట్టాలు పొందిన జర్నలిస్టులకు ఇళ్లను నిర్మించాలన్నారు. మీడియా ఎంప్లాయిస్‌కు కూడాS కొడిమి వద్ద ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్, సీనియర్ జర్నలిస్టులకు పింఛను ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ శశిధర్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు మార్కండేయులు, ప్రవీణ్, రసూల్, రామ్మూర్తి, రాజశేఖర్, భాస్కర్‌రెడ్డి, చౌడప్ప, సనప రామకష్ణ, వివిధ మండలాల విలేకరులు పాల్గొన్నారు.