కడియం.. రెండేళ్లు | kadiyam two years to complete the deputy chief minister | Sakshi
Sakshi News home page

కడియం.. రెండేళ్లు

Published Wed, Jan 25 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

కడియం.. రెండేళ్లు

కడియం.. రెండేళ్లు

డిప్యూటీ సీఎంగా నేటికి రెండు సంవత్సరాలు పూర్తి
మంత్రిగా 11 ఏళ్ల ఐదు నెలల పాటు బాధ్యతలు
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధిగా రికార్డు


వరంగల్‌ : రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సరికొత్త ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ సభ్యుడిగా పని చేసిన కడియం శ్రీహరి అనూహ్య పరిణామాల మధ్య 2015 జనవరి 25న  బాధ్యతలు  చేపట్టారు. అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన కడియం వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా, పరిపాలన పరంగా విద్యా శాఖలో తనదైన ముద్ర కొనసాగిస్తున్నారు.

అభివృద్ధిపై మార్క్‌
వరంగల్‌ ఉమ్మడి జిల్లాను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైనిక్‌ స్కూల్‌ను త్వరలోనే వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయించారు. వరంగల్‌లో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలయ్యేందుకు చొరవ తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం కేసీఆర్‌ జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో... పరిపాలనకు సంబంధించి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత వేసవిలో వరంగల్‌ నగరానికి గోదావరి నీళ్లు తెచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాజకీయంగా, పరిపాలన పరంగానే కాకుండా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో కొత్త రికార్డ నమోదు చేశారు.

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ రోజులు మంత్రిగా పని చేసిన నూకల రామచంద్రారెడ్డి రికార్డును కడియం శ్రీహరి అధిగమించారు. కడియం శ్రీహరి 1994 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్టేష¯Œ ఘ¯Œ పూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది డిసెంబరు 12న ఎ¯Œ . టీ.రామారావు మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతో 1995 సెప్టెంబరు 1న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం.. 1999 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. 2003 అక్టోబరు 1న చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయడంతో పఆ తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగింది. ఇలా 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే వరకు కడియం శ్రీహరి మంత్రిగా కొనసాగారు. మార్కెటింగ్, గిడ్డంగులు, విద్య, సాంఘిక సంక్షేమం, భారీ నీటిపారుదల శాఖలు నిర్వహించారు. టీడీపీ హయాంలో మొత్తం తొమ్మిదేళ్ల ఐదు నెలల రెండు రోజులు కడియం శ్రీహరి మంత్రిగా పని చేశారు. పదేళ్ల తర్వాత కడియం శ్రీహరి అనూహ్య పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. 2015 జనవరి 25న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా బుధవారంతో రెండేళ్లు పూర్తవుతోంది. గతంలో చేపట్టిన విద్యా శాఖ బాధ్యతలనే చూస్తున్నారు. మొత్తంగా కడియం శ్రీహరి మంత్రిగా పదకొండేళ్ల ఐదు నెలల రెండు రోజులుగా పూర్తి చేసుకున్నారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన నూకల రామచంద్రారెడ్డి 11 ఏళ్ల 4 నెలల 19 రోజులు మంత్రిగా పని చేశారు. 1960 జనవరి 11 నుంచి 1967 మార్చి 6 వరకు దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మాందనరెడ్డి క్యాబినెట్లలో నూకల రామచంద్రారెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1973 డిసెంబరు 10 నుంచి 1978 మార్చి 5 వరకు జలగం వెంగళరావు మంత్రివర్గంలో నూకల రామచంద్రారెడ్డి ఆర్థిక మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రశ్రేణి నేతగా కొనసాగిన నూకల రామచంద్రారెడ్డి డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి 1957, 1962, 1967, 1972 వరకు ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు నమోదు చేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు సైతం దశాబ్ధానికిపైగా మంత్రిగా పని చేసిన రికార్డు ఉంది. 1985లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పొన్నాల లక్ష్మయ్య 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1991 ఆగస్టు 5న నేదురుమల్లి జనార్దనరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1992 అక్టోబరు 9 వరకు మంత్రిగా పని చేశారు. తర్వాత 2004 మే 14న వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా చేరారు. అనంతరం కె.రోశయ్య, ఎ¯Œ .కిరణ్‌కుమారెడ్డి ప్రభు త్వాల్లోనూ కొనసాగారు. 2004 మార్చి 1న రాష్ట్రపతి పాలన విధించే వరకు మంత్రిగా కొనసాగారు. ఇలా 10 సంవత్సరాల 11 నెలల 20 రోజులపాటు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా కొనసాగారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో పదేళ్లకుపైగా మంత్రిగా పని చేసిన ముగ్గురే ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement