Deputy chief
-
‘రాఫెల్’ను నడిపిన ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్‌లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్‌కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది. -
రైతుబంధు దేశానికే ఆదర్శం
సాక్షి, కొత్తగూడెం/అశ్వారావుపేట : రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. అన్నదాతలు అప్పులు చేయకుండా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం అశ్వారావుపేట మండ లం అచ్యుతాపురం గ్రామంలో రైతుబంధు చెక్కుల ను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రూ.12వేల కోట్లు పెట్టుబడి కోసం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం భూములు వివాదాల్లో ఉన్నాయని, అయినా భూ రికార్డుల ప్రక్షాళనను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు సమర్థంగా నిర్వహించారని అన్నా రు. ప్రక్షాళనపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మొత్తంమీద 300 గంటలపాటు సమీక్ష చేశారని చెప్పారు. సెక్యూరిటీ ఫీచర్లతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారసత్వం కోసం గతంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని.. ఇప్పుడా సమస్య సమసిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో మొదటి విడతలో 79,184 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16,124కోట్లు రైతు రుణమాఫీ చేసిందన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో పడుతుందని అప్పటి సీఎం కిరణ్ చెప్పారని, అలాంటి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 24 గంటలపాటు, ఒక్క నిమిషం కూడా బ్రేక్‌డౌన్ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులు క్రమశిక్షణతో ఉన్నారని అభినందించారు. రాష్ట్ర అభివృద్దిలో ఈప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది కీలకపాత్ర అని అన్నారు. కేంద్ర రహదారుల శాఖామాత్యులు నితిన్గడ్కరీతో చర్చించి తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి రూ.2వేల కోట్లు సాధించారన్నారు. రైతు సమితుల బాధ్యతలు పెంచాం: వ్యవసాయ మంత్రి పోచారం రైతు సమన్వయ సమితుల బాధ్యతలు మరింత పెంచామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు మంచి వంగడాలు నాటి, చక్కటి దిగుబడి సాధించేందుకు, మద్దతు ధర అందించేందుకు రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,61,000 మంది సభ్యులు ఉన్నారని, వీరంతా ఒక్కొక్కరు 36 మంది రైతులను కలిస్తే సరిపోతుందన్నారు. 1611 టీఎంసీల గోదావరి నీరు, 600 టీఎంసీల కృష్ణానీరు వృథాగా సముద్రంలో కలుస్తుండగా వీటిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. రూ.93వేల కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 70 ఏళ్లలో రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిన అవసరమే లేకుండా.. బ్యాంకులు రుణాలివ్వాల్సిన అవసరం లేకుండా రైతులను అభివృద్ధిచేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పోచారం అన్నారు. 2022కి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ అన్నారని.. ఏమంత్రం వేసి రెట్టింపుచేస్తారని ప్రశ్నించారు. వ్యవసాయానికి మౌళిక వసతులు పెంచకుండా ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారని అన్నారు. రైతు సమన్వయ కమిటీలకు రానున్న రోజుల్లో రూ.300కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ రైతుకు రూ. 5 లక్షల బీమా : గుత్తా రైతు సమన్వయ సమితి రాష్ట్ర సమన్వయకర్త గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతుకు రూ.5లక్షల బీమా కల్పించేందుకు రూ.500కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 10వేల ట్రాక్టర్లను సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. కోనసీమను తలపించేలా ఇక్కడి వాతావరణం ఉందని కొనియాడారు. చిరస్థాయిగా గుర్తుంచుకుంటా: తుమ్మల తనకు 35ఏళ్ల రాజకీయ జీవితాన్నిచ్చిన సొంత నియోజకవర్గ ప్రజలను చిరస్థాయిగా గుర్తుంచుకుంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈప్రాంతానికి ఏం కావాలన్నా దగ్గరుండి అభివృద్ధి చేస్తానన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వివాదాలను పరిష్కరించి రెండోవిడతలో చెక్కులు అందిస్తామన్నారు. రైతు పక్షపాతి సీఎం: ఎంపీ పొంగులేటి రైతుబంధు చెక్కులతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వల్లనే టన్ను పామాయిల్ గెలల ధర రూ.10వేలకు పెరిగిందని.. ఈఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో వస్తారని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ త్వరలో రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సరిపోతుందన్నారు. ధరణి సాఫ్ట్వేర్ ద్వారా జూన్ 2నుంచి పాల్వంచ మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, ఆ తర్వాత జిల్లా మొత్తం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా రైతుసమన్వయ సమితి చైర్మన్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, జేసీ రాంకిషన్, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఏఓ అభిమన్యుడు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కడియం.. రెండేళ్లు
డిప్యూటీ సీఎంగా నేటికి రెండు సంవత్సరాలు పూర్తి మంత్రిగా 11 ఏళ్ల ఐదు నెలల పాటు బాధ్యతలు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధిగా రికార్డు వరంగల్ : రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సరికొత్త ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా పని చేసిన కడియం శ్రీహరి అనూహ్య పరిణామాల మధ్య 2015 జనవరి 25న బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన కడియం వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా, పరిపాలన పరంగా విద్యా శాఖలో తనదైన ముద్ర కొనసాగిస్తున్నారు. అభివృద్ధిపై మార్క్ వరంగల్ ఉమ్మడి జిల్లాను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైనిక్ స్కూల్‌ను త్వరలోనే వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయించారు. వరంగల్‌లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలయ్యేందుకు చొరవ తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో... పరిపాలనకు సంబంధించి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత వేసవిలో వరంగల్ నగరానికి గోదావరి నీళ్లు తెచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాజకీయంగా, పరిపాలన పరంగానే కాకుండా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో కొత్త రికార్డ నమోదు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ రోజులు మంత్రిగా పని చేసిన నూకల రామచంద్రారెడ్డి రికార్డును కడియం శ్రీహరి అధిగమించారు. కడియం శ్రీహరి 1994 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్టేష¯Œ ఘ¯Œ పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది డిసెంబరు 12న ఎ¯Œ . టీ.రామారావు మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతో 1995 సెప్టెంబరు 1న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం.. 1999 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. 2003 అక్టోబరు 1న చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయడంతో పఆ తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగింది. ఇలా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కడియం శ్రీహరి మంత్రిగా కొనసాగారు. మార్కెటింగ్, గిడ్డంగులు, విద్య, సాంఘిక సంక్షేమం, భారీ నీటిపారుదల శాఖలు నిర్వహించారు. టీడీపీ హయాంలో మొత్తం తొమ్మిదేళ్ల ఐదు నెలల రెండు రోజులు కడియం శ్రీహరి మంత్రిగా పని చేశారు. పదేళ్ల తర్వాత కడియం శ్రీహరి అనూహ్య పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. 2015 జనవరి 25న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా బుధవారంతో రెండేళ్లు పూర్తవుతోంది. గతంలో చేపట్టిన విద్యా శాఖ బాధ్యతలనే చూస్తున్నారు. మొత్తంగా కడియం శ్రీహరి మంత్రిగా పదకొండేళ్ల ఐదు నెలల రెండు రోజులుగా పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన నూకల రామచంద్రారెడ్డి 11 ఏళ్ల 4 నెలల 19 రోజులు మంత్రిగా పని చేశారు. 1960 జనవరి 11 నుంచి 1967 మార్చి 6 వరకు దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మాందనరెడ్డి క్యాబినెట్లలో నూకల రామచంద్రారెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1973 డిసెంబరు 10 నుంచి 1978 మార్చి 5 వరకు జలగం వెంగళరావు మంత్రివర్గంలో నూకల రామచంద్రారెడ్డి ఆర్థిక మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రశ్రేణి నేతగా కొనసాగిన నూకల రామచంద్రారెడ్డి డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1957, 1962, 1967, 1972 వరకు ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు నమోదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు సైతం దశాబ్ధానికిపైగా మంత్రిగా పని చేసిన రికార్డు ఉంది. 1985లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పొన్నాల లక్ష్మయ్య 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1991 ఆగస్టు 5న నేదురుమల్లి జనార్దనరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1992 అక్టోబరు 9 వరకు మంత్రిగా పని చేశారు. తర్వాత 2004 మే 14న వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా చేరారు. అనంతరం కె.రోశయ్య, ఎ¯Œ .కిరణ్‌కుమారెడ్డి ప్రభు త్వాల్లోనూ కొనసాగారు. 2004 మార్చి 1న రాష్ట్రపతి పాలన విధించే వరకు మంత్రిగా కొనసాగారు. ఇలా 10 సంవత్సరాల 11 నెలల 20 రోజులపాటు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా కొనసాగారు. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పదేళ్లకుపైగా మంత్రిగా పని చేసిన ముగ్గురే ఉన్నారు. -
కరువు నివారణకే హరితహారం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్‌బెల్ట్ : రాష్ట్రంలో కరువు శాశ్వత నివారణ కోసం కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయనిన్నారు. దీనికి గత పాలకులు పర్యావరణ పరిరక్షణపై పట్టించుకోకపోవడమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో 230 కోట్లు మెుక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టగా ఈ ఏడాది 46 కోట్ల మెుక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ గనులు, ఓపెన్‌కాస్టులు, కార్మికకాలనీలు, స్వాధీన భూముల్లో మొక్కలు నాటడంతోపాటు సంరక్షించుకోవాలన్నారు. సింగరేణి ఇప్పటికే 75 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు మనోహర్‌రావు, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, స్పెషల్ ఆఫీసర్ చక్రధర్, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, ఎస్‌ఓటూ జీఎం సయ్యద్ హబీబ్‌హుస్సేన్, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, వైస్ చైర్మన్ గణపతి, కౌన్సిలర్లు సిరుప అనిల్, కంకటి రాజవీరు, గోనె భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, కొక్కుల తిరుపతి, కటకం స్వామి, జోగుల సమ్మయ్య, బిబిచారి పాల్గొన్నారు. -
కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప
కల్తీ మద్యం విక్రయ దారులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడారు. బాధితులకు మద్యం విక్రయదారుల నుంచే నష్ట పరిహరం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వచ్చే ఏడాది పూర్తి స్థాయి డీఎస్సీ
వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయి డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రైతు సమస్యలపై పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇచ్చామని... ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ది కోసమే నిరసన వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ఏకీకృత సర్వీసు అంశంపై సుప్రింకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతే స్పందిస్తామని వివరించారు. ఇక ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త విద్యావాలంటీర్ల రిపోర్టింగ్ తేదీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించామని తెలియజేశారు. -
అనంతపురాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
పెద్దాపురం :అకాల వర్షాలతో నష్టపోయిన అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం పెద్దాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణం వల్ల అనంతపురంలో భారీ వర్షాలు కురిసి, పంటనష్టం వాటిల్లిందన్నారు. నష్టం ఏ మేరకు జరిగిందో అంచనా వేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అనంతపురంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటినందున జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికార కార్యక్రమాలు రద్దు చేసుకుని అనంతపురం వెళుతున్నట్టు తెలిపారు. అక్కడి పరిస్థితిని పూర్తిగా పరిశీలించాక తక్షణ సాయంపై ఉన్నతాధికారులతో సమీక్షించి ఆదుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు చేతికొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, బొడ్డు బంగారుబాబు, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు పాల్గొన్నారు. పుష్కర పనుల తనిఖీలకు ‘బాబు’ రెడీ! రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు జరుగుతున్న వివిధ పనులను ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు ఆకస్మిక తనిఖీ చేయనున్నారు. చంద్రబాబు మే ఒకటి, రెండు తేదీల్లో రాజమండ్రి వస్తారని, తదుపరి రెండు రోజులు నగరంలో ఉండి, పుష్కర పనులను పరిశీలిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పనుల తీరుపై సమీక్షలు జరుపుతారని పేర్కొన్నాయి. ఈనెల 20 తరువాత బాబు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచాం. -
అప్డేట్ అవ్వండయా!
♦ కొత్త సమాచారం కరువు ♦ ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు ♦ ఎంపీ, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి ♦ తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనే లేదు ♦ నిద్రావస్థలో ఎన్ఐసీ విభాగం ♦ పట్టించుకోని కలెక్టర్ కరుణ సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రపంచం మారిపోతోంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయమే. ఏది తెలుసుకోవాలన్నా.. చూడాలన్నా అన్ని కంప్యూటర్‌తోనే. ప్రభుత్వాలు ఇప్పుడు ఇదే పంథాలో వెళ్తున్నాయి. రేషన్‌కార్డు, పింఛన్లు, స్కాలర్షిప్, ఓటరు నమోదు నుంచి గ్యాస్ బుకింగ్ వరకు అన్ని ఆన్లైన్లోనే. కొత్త టెక్నాలజీ ప్రకారం మారుతున్న విధానాలకు అనుగుణంగా ప్రజలు సాంకేతిక అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. అధికారులు మరో ముందడుగు వేసి అన్ని ఆన్లైన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, ఫిర్యాదులు, పిటిషన్లు, తాజాగా ఓటరు నమోదుతో ఆధార్ కార్డు అనుసంధానం అంతా ఇంటర్నెట్లోనే జరుగుతుందంటున్నారు. దీనికోసం ప్రజలు సిద్ధం కావాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఇలా ప్రజలకు సూచనలు ఇస్తున్న జిల్లా అధికార యంత్రాంగం.. ఈ విషయంలో అప్డేట్ కావడం లేదు. అధికారులు సాంకేతికంగా ముందుకు కదలడంలేదని చెప్పడానికి అధికారిక వెబ్సైట్ సాక్షిగా నిలుస్తోంది. జిల్లా సమాచారం లేదు.. ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు ఒక అధికారిక వెబ్సైట్ ఉంటుంది. మన జిల్లాకు ఠీఠీఠీ.ఠ్చీట్చజ్చ.జీఛి.జీ వెబ్సైట్ ఉంది. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఉండాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే సమాచారంతో జాతీయ సాంకేతిక కేంద్రం(ఎన్ఐసీ) జిల్లా విభాగం వారు ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంటారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా వెబ్సైట్ తీరు అధ్వానంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కొత్త సమాచారం అనేదే కనిపించడంలేదు. ఎప్పుడో ఏళ్లనాటి సమాచారమే ఉంది. జిల్లాకు ఉండే అధికారిక వెబ్సైట్లో కొత్త విషయాలు ఏవీ ఉండవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది నెలలు గడిచినా కొత్త రాష్ట్రం గురించి ప్రస్తావనే లేదు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన వారు పేర్లు, ఫొటోలు జిల్లా వెబ్సైట్లో దర్శనమివ్వడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు, ఫొటో జిల్లా వెబ్సైట్లో కనిపించడం లేదు. గత సమాచారమే దిక్కు కొత్త ప్రజాప్రతినిధుల సమాచారం నమోదు చేయకపోగా గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారి వివరాలు ఉన్నారుు. వీటిని ఇటీవలే తొలగించారు. ఇలాంటి ప్రాథమిక అంశాలతోపాటు జిల్లాకు సంబంధించిన కొత్త సమచారం ఏదీ వెబ్సైట్లో ఉండడం లేదు. జిల్లా యంత్రాంగం సమాచా రం ఇవ్వనిదే తాము కొత్త సమాచారం చేర్చలేమని ఎన్ఐసీ విభాగం వారు చెబుతున్నారు. ఎన్ఐసీ విభాగం వారు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది తెలియడంలేదు. కలెక్టర్ ఒక్కసారి అయినా జిల్లా వెబ్సైట్ చూస్తే కొంత మేరకైనా మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వెబ్సైట్లో పాత సమాచారం, తప్పుడు వివరాలు.. ♦ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి రెండేళ్లు కావస్తున్నా జిల్లా వెబ్సైట్లో 2001 ప్రకారం 32.46 లక్షల జనాభా అని మాత్రమే ఉంది. ♦ వరంగల్.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థగా మారింది. ఈ మేరకు కార్పొరేషన్ అన్ని చోట్ల బోర్డులను మార్చింది. ఈ వివరాలు వెబ్సైట్లో లేవు. ♦ గతేడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలయ్యాయి. వెబ్సైట్లో ని సమాచారంలో మాత్రం జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నట్లుగా ఉంది. ♦ జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలకు.. భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు గతేడాది ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్సైట్లో జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ♦ వరంగల్ జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్సైట్లో పెట్టారు. ఆ ఏడాది జనవరి 27 నుంచి నాలుగు రోజులు జాతర జరిగిందని పేర్కొన్నారు. 2012, 2014 సంవత్సరాల్లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు. ♦అన్నింటి కంటే ముఖ్యంగా జిల్లా పరిపాలనలో కీలకమైన జేసీ ఎవరు అనే విషయం వెబ్సైట్లో కనిపించడంలేదు. ఇతర కీలక శాఖల అధికారులు సమాచారం లేదు. -
కలలో కూడా ఊహించలే...
డిప్యూటీ సీఎంను అవుతానని అనుకోలే... పొరపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ మార్పు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ : ఉప ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదు... ఎంపీలుగా సీతారాం నాయక్ తాను హాయిగా ఉన్నాం... ఇద్దరం కలి సి మారుతీ స్విఫ్ట్ ఒక్క రోజే కొనుక్కున్నాం... ఎంపీగా ఉన్న వారు డిప్యూటీ సీఎం అవుతారని ఎవరు అనుకోరు... ఇది ఒక్క కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు జనగామ నుంచి మొదలు హన్మకొండ వరకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా ఆహ్వానం పలికారుు. రాత్రి హన్మకొండలోని ఏకశిల పార్కులో జరిగిన సన్మాన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ 1994లో తొలిసారిగా గెలిచిన దాస్యం ప్రణయ్‌భాస్కర్, తాను ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రులమయ్యామని గుర్తు చేశారు. ఈ యువకులు ఇద్దరితో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని ఆనాడు జిల్లా ప్రజలు ఇదే విధంగా బ్రహ్మరథం పట్టారన్నారు. వీరి రుణం ఏమి చేసినా తీర్చలేనిదన్నారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని పట్టుదలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు పోతున్నారని చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ మార్పు చేశారని పేర్కొన్నారు. పగవాడి ముందు, పక్క వారి ముందు అభాసుపాలు కావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. విద్యాశాఖ తనకు ఇష్టమైన శాఖ అని.. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినపుడు గుర్తింపు తీసుకొచ్చింది ఆ శాఖేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అక్షరాస్యతలో మొదటిస్థానంలో ఉంచానన్నారు. అప్పుడు తన పనితీరు, పట్టుదల, చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ చూసి ఎంతో నమ్మకంతో రిస్క్ తీసుకుని బాధ్యతను అప్పగించారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తెలంగాణలో జిల్లాను అగ్రభాగంలో నిలబెట్టాలనే తపనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగానే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, మురికివాడలు లేని నగరంగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడ్డదన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ పనులు పూర్తి కాలేదని విమర్శిం చారు. ఇక్కడి బొగ్గును సీమాంధ్రకు తరలించి.. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ఇక్కడేమో కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు, అప్తులను పోగొట్టుకున్నారని, వారందరినీ కాపాడుకుంటామన్నారు. సాధ్యమైన మేరకు పొరపాటు చేయనని, తెలియకుండా పొరపాటు చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీలో అందరు సమానమేనని కడియం శ్రీహరి అన్నారు. వెనకొచ్చిన, ముందు నుంచి ఉన్నా... పార్టీలో చేరాక అందరూ పార్టీ కార్యకర్తలేనన్నారు. గోదావరిలో ఎన్నో ఉపనదులు కలుస్తాయని, భద్రాచలంలో గోదావరిలోకి దిగి ఇం దులో ఏ నది అని ఎలా గుర్తిస్తారని ఉదహరించారు. అవకాశాలు సందర్భోచితంగా, సమీకరణలు బట్టి వస్తుంటాయని, రాని వారు అధైర్యపడొద్దన్నారు. అవకాశాలు వచ్చిన వారు వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎంపీగా మొదటిసారిగా గెలిచిన కల్వకుంట్ల కవిత పదవిలో ఏం రాణిస్తారని సందేహాలు వ్యక్తం చేశారన్నారు. పార్లమెంట్లో తొలిసారిగా అడుగు పెట్టిన మహిళా ఎంపీల్లో పది మందిని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారని, ఇందులో కవిత పేరు కూడా ఉందన్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మా ట్లాడుతూ నాయకులందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నాయని, సమన్వయ కమిటీగా ఏర్పడి ఖాళీలు గుర్తించి వాటి భ ర్తీకి కృషి చేస్తామన్నారు. జిల్లా సమస్యలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజల్లో అభాసుపాలయ్యాయని విమర్శిం చారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కుటుంబమన్నారు. కుటుంబ పెద్ద ఏ బాధ్యత అప్పగించినా కూలీగా పని చేస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మార్పుతో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్ళన్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి మరకపడొద్దని రాజ య్య స్థానంలో మార్పు చేశారన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మార్పు చేయాల్సి వచ్చిందన్నా రు. ఇది రాజకీయం కోసం కాదు.. ప్రజల కోసమేనని, ప్రజల కోసం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. -
డెంగీ మరణాల్లేవ్: డిప్యూటీ సీఎం రాజయ్య
హన్మకొండ: తెలంగాణలో ఇప్పటి వరకు డెంగీతో ఎవరూ చనిపోలేదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పారు. హన్మకొండలో మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలీజా పాజిటివ్ వచ్చినప్పుడే డెంగీ వ్యాధి వచ్చిన ట్లని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎలాజా పాజిటివ్ వచ్చిన కేసులు లేవన్నారు. అయితే ప్లేట్లెట్లు తగ్గితే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు డెంగీ వ్యాధి పేరుతో రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని పేర్కొన్నారు. డెంగీతో చనిపోతే ఆయూ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరైనా చనిపోతే వివరాలు అందజేయూలని సూచించారు. -
నిజాం పాలన స్వర్ణ యుగం
ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం కాలం నాటి అభివృద్ధి, మత సామరస్యం, సంస్కృతులను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం మైనారిటీస్ ఎంపవర్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో జరిగిన ‘మైనారిటీ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిజాం పాలన స్వర్ణ యుగమని, వారి కాలంలో అభివృద్ధితో పాటు మత సామరస్యం వెల్లివిరిసిందని కొనియాడారు. ఏడో నిజాం పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందేదని తెలిపారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమానంగా ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత నిజాం నవాబుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమంలో ఒక్క ఆంధ్రుడికీ నష్టం జరగలేదన్నారు. ఒకప్పుడు తెలంగాణను ఏలిన ముస్లింలు ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషను బలవంతంగా రుద్ది, 55 వేల మంది ఉర్దూ భాష వచ్చిన ఉద్యోగులను తొలగించారన్నారు. అప్ప ట్లో ఉద్యోగాలలో ముస్లింలు 33 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక్క శాతం కూడా లేరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 40 వేల మంది పేద ముస్లిం యువతులకు వివాహాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ లాంటి నేతను చూడలేదు: మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ ముస్లింలకు చేయూతనిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఆయన చలవేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా మహ్మద్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ముస్లిం డిప్యూటీ సీఎమ్మే..
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దర్బార్‌లో ప్రతీ ముస్లిం ఓ డిప్యూటీ సీఎమ్మేనని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం రాత్రి మెదక్ పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో జరిగిన మైనార్టీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు మహర్ధశ వచ్చిందన్నారు. మునుపెన్నడు లేని విధంగా కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 51 వేలు, బడ్జెట్లో మైనార్టీలకు వెయ్యి కోట్లు, నిరుద్యోగులకు రూ.1 లక్ష ఉపాధి రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు.ముస్లింల సంస్క ృతిని తెలియని టీడీపీ మద్దతిస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి ఓటేయ్యడం వృథా అన్నారు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ని జాం హయాంలోనే రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లు, ఆస్పత్రులు, విద్యాలయాలు కట్టారని తెలిపారు. అందుకే తెలంగాణలో గల ఐదు జిల్లాల పేర్లు ముస్లిం పాలకులవే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ గరీబ్ పార్టీ కాదని, అది గర్కే పార్టీ అని తెలిపారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనం చేయ డం తగదన్నారు. జగ్గారెడ్డి వల్ల వందలాది మంది ఉద్యమకారులు తమ మర ణవాగ్మూలం రాసి చనిపోయారన్నారు. మెదక్ ఇన్చార్జ్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల పాలన లో మైనార్టీలు ఆర్థికంగా చితికి పోయారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మహ్మద్ సమీర అనే యువతి పెళ్లికి డ బ్బులు లేక మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకోవడం పేదరికానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర కార్యదర్శి దేవేం దర్‌రెడ్డి మాట్లాడుతూ ఈసారి మెదక్ ముస్లింలు ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థికే వేసి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ దేశ్య నాయక్ టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టమధు, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, గంగాధర్, కౌన్సిలర్లు సులోచన, గాయత్రి, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షు లు సంజీవులు నాయక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధన్‌రాజ్ నాయక్ పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి
► ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అవగాహన ► మేనిఫెస్టో అమలే మా ఎజెండా ►ప్రణాళికలు పటిష్టంగా రూపొందించాలి ►అసంపూర్తి సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి ► పీహెచ్‌సీల స్థాయి పెంపు ►కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ►డిప్యూటీ సీఎం రాజయ్య సాక్షి, హన్మకొండ: గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ప్రణాళికలు రూపొందిస్తే కుదరదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సాంకేతిక లోపాలు లేనివిధంగా పటిష్టంగా రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సూచించారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మరో రెండు రోజులు సమయం తీసుకుని పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లా-మన ప్రణాళికలోని అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆస్పత్రులను 30 పడకల స్థాయికి పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అన్ని రకాల వైద్యసేవలు అం దుబాటులోకి తెస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రుల్లో అన్ని రకాల ఆపరేషన్లు చేసేందుకు సరిపడా వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మం జూరు చేసిన రూ.150 కోట్ల నిధులతో జిల్లా కేంద్రంలో నిమ్స్ స్థాయిలో వెద్యసదుపాయం కల్పిస్తామన్నారు. హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటుందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. మామునూరు వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో వెటర్నిటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే... జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం వరి, కంది విత్తనాలపై జరుగుతున్న పరిశోధనలను మెట్ట పంటలకు విస్తరించాలని సూచించారు. భూసేకరణ, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని మెజార్టీ ప్రజాప్రతినిధులు సూచించా రు. ఈ అంశంపై వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్, టెక్స్టైల్స్ పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసే విధంగా వరంగల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. కార్పొరేషన్ ఈ విషయంలో విఫలమమైతే మన దగ్గరకు వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్లే అవకాశముందని హెచ్చరించారు. అంతకుముందు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమలతోపాటు విమానాశ్రయం, వెటర్నిటీ యూనివర్సిటీ, వరంగల్ చుట్టూ రింగురోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. మహబూబాబాద్‌లో ఉక్కు పరిశ్రమతోపాటు గిరిజన వర్సిటీని నెలకొల్పాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమిని గుర్తించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలి అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచిం చారు. పెండింగ్ ప్రాజెక్టుల జాబితా రూపొందించి ప్రాధాన్యాన్ని అనుసరించి పనులన్నీ రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో మూడు గోదాంలు నిర్మించాలని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కోరారు. 30 ఏళ్ల తర్వాత వరంగల్ డీసీసీబీకి రూ.3 కోట్ల లాభం వచ్చిందన్నారు. తండాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయూలి గిరిజన తండాల్లోని మహిళలు, యువకులకు బీడీ, సబ్బుల తయారీ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడంతోపాటు తండాల్లో కుటీర పరిశ్రలు నెలకొల్పాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. తాను తండాల నుంచే వచ్చానని... సరైన ఉపాధి వనరులు లేక కారణంగానే కొన్ని గిరిజన తండాలు గుడుంబా తయారీ కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద జిల్లాకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయని, వీటిని సద్విని యోగం చేసే దిశగా అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలు రూపొందించాలని కడియం శ్రీహరి సూచించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వేళకు రావడం లేదని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండటం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ఎంతో గొప్పదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిర్మాణాత్మక రూపం ఇవ్వడంలో భాగమే మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అజ్మీరా చందూలాల్, శంకర్‌నాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణదాస్పండా, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లుతోపాటు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. చివరి నిమిషం లో ఎంపీ గుండు సుధారాణి సమావేశానికి వచ్చారు. మల్లన్న భూములపై దీక్షకు సిద్ధం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సంబంధించిన చెరు వు భూములు అన్యాక్రాంతం కావడంపై ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఉదాసీనతపై ప్రశ్నించారు. రియల్ మాఫియా ధాటికి జిల్లాలో చాలా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన మల్లన్న ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైన పక్షంలో అసెంబ్లీ ఎదుట మహాత్ముడి విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఒక నియోజకర్గం పరిధిలో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలతో కమిటీ ఏర్పా టు చేసి ఆర్డీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందిస్తే... అనుమానాలకు తావులేకుం డా ఉంటుందని ఆయన కలెక్టర్ కిషన్‌కు సూచించారు. కాగా, మల్లన్న జాగ మాయం, సమస్యలపై ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ప్రజాప్రతినిధుల సూచనలు ►పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చేందుకు భూపాలపల్లి కేటీపీపీ ఉత్పత్తి ►సామర్థ్యాన్ని 2 వేల మెగావాట్లకు పెంచాలి. ►భూపాలపల్లిలో ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి. ►వరంగల్ గోపాలపురంలో శిల్పారామానికి కేటాయించిన 13 ఎకరాల స్థలం ఆక్రమణకు గురవుతోంది. దీన్ని అరికట్టడంతోపాటు వెంటనే శిల్పారామం పనులు ప్రారంభించాలి. ►ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములను సేకరించాలి. ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పత్తి అనుబంధ పరిశ్రమలు విస్తరించాలి. ►అభివృద్ధి పనుల్లో ‘నిట్’ సహకారం తీసుకోవాలి. -
ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం
జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్లజగదీష్రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ కల్చరల్ :తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. అందుకోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారన్నారు. సోమవారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లాకు విద్యాశాఖను ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముస్లింలు ప్రార్థించాలని కోరారు. హిందువులు, ముస్లింలు పండగలను కలిసిమెలిసి నిర్వహించుకునే గొప్ప సంప్రదాయం నల్లగొండకు ఉందని, దీనిని ఇలాగే కొనసాగించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఇఫ్తార్ విందు ఆరగించారు. కార్యక్రమంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు శాసనసభ్యులు వేముల వీరేశం, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఆర్డీఓ ఎండీ జహీర్, టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, జిల్లా అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫరీదొద్దీన్, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సిం హారెడ్డి, కె.వి.రామారావు, ఎంపీపీ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, సైయ్యద్ జమాల్‌ఖాద్రీ, అలీమ్, బషీరోద్దీన్, ముంతాజ్ అలీ, వలీ, ఫయిమోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఖలీమ్ పాల్గొన్నారు. వక్ఫ్‌బోర్డుకు త్వరలో జ్యుడీషియల్ పవర్ నల్లగొండ : వక్ఫ్‌బోర్డుకు త్వరలో జ్యుడీషియల్ పవర్ కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సోమవారం నల్లగొండలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ పవర్ ఇవ్వాలని మంత్రి మండలిలో తీర్మానించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పించడానికి కమిటీ వేశామని, కమిటీ నివేదిక అందగానే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు ఏడాదికి 394 కోట్ల రూపాయలు కేటాయించాయన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా మజీద్లు, ఈద్గాల మరమ్మతులకు 50 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా లాల్‌దర్వాజ వద్ద బోనాల పండగకు ఏ ముఖ్యమంత్రి కూడా హాజరు కాలేదని, మొట్టమొదటిసారిగా కేసీఆర్ హాజరయ్యారన్నారు. హిందూ, ముస్లిం అనే భావన లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రెవెన్యూ పరంగా జిల్లా వెనుకబడి ఉందని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీతో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం రాజయ్య రాక
భద్రాచలంలో ఐటీడీఏ పథకాలపై సమీక్ష సాక్షి, ఖమ్మం: ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. హన్మకొండ నుంచి బయలు దేరి ఉదయం 8 గంటలకు ఆయన ఇల్లెందు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి భద్రాచలం వెళ్లి ఉదయం 10.30 గంటలకు సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అమలవుతున్న పలు పథకాలపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే వైరాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆయనను అధికారులతో పాటు, రాజకీయ పార్టీల నాయకులు కలుసుకున్న అనంతరం వైద్యులు సన్మానించనున్నారు. -
డిప్యూటీ సీఎంను కలిసిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు
చినగంజాం: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుఛ్చాన్ని అందించారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఆంధ్ర కబడ్డీ చైర్మన్ పర్వతరెడ్డి శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వీర్లంకయ్య, ట్రెజరర్ రంగారావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి శిఖరం రాంబాబు, తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ కోచ్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైస్ ప్రసిడెంట్ అంజిరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్స్ తదితరులున్నారు. -
నేడు రాజయ్య రాక
టీఆర్ఎస్ శ్రేణుల స్వాగత సన్నాహాలు - పెంబర్తి నుంచి ర్యాలీ..అమరుల స్థూపాలకు నివాళి - హన్మకొండలో పార్టీ కార్యకర్తలతో సమావేశం - రేపు అధికారులతో వివిధ శాఖలపై సమీక్ష వరంగల్: డిప్యూటీ సీఎంగా నియామకమైన తర్వాత డాక్టర్ రాజయ్య తొలిసారి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నా రు. రాజయ్య హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 10గంటలకు పెంబర్తికి వస్తారు. అక్కడి నుంచి జనగామ, రఘునాథపల్లి మీదుగా సొంత నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ చేరుకుంటారు. అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4గంటలకు కాజీపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్, అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా బాలసముద్రం లోని జయశంకర్ విగ్రహానికు పూలమాల వేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారని టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. రాజయ్య సోమవారం జిల్లా అధికారికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. రాజయ్యపైనే భారం రాజయ్య డిప్యూటీ సీఎం కావడంతో జిల్లా టీఆర్ఎస్ రాజకీయూల్లో కీలకంగా మారారు. రాష్ట్ర మంత్రివర్గంలో సైతం ఇప్పటి వరకు ఆయనకొక్కడికే అవకాశం దక్కింది. జిల్లా నుంచి సీనియర్ నాయకులు చందూలాల్, వినయభాస్కర్, కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతానికి బెర్త్ దక్కలేదు. ఇక స్పీకర్‌గా భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు పరిమితులు నెలకొన్నాయి. ఈ దశలో ప్రస్తుతానికి రాజకీయూల్లో రాజయ్యదే ఆధిపత్యంగా చెప్పవచ్చు. కలిసిసాగడం పరీక్షే.. గులాబీ పార్టీ నేతలను, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎలా కలుపుకుపోతారన్న అంశం పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. నిర్మాణపరంగా పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఎన్నికల ముందు లోటుపాట్లు బహిర్గతం కానప్పటికీ పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధానం కానున్నది. ఎన్నికల ముందున్న విభేదాలు పక్కనపెట్టి జిల్లా ప్రజాప్రతినిధులను ఒక్కతాటిపై నడపాల్పి ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా జిల్లాను వివిధ రంగాల్లో ప్రగతిబా ట పట్టించాల్సి ఉంది. ముఖ్యంగా జిల్లా ప్రజలు పె ట్టుకున్న కోటి ఆశలను నిజం చేసే బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. జిల్లాలో విపక్ష ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వీరి నుంచి రాజకీయ విమర్శలను ఎదుర్కొవడం అంతసులువైంది కాదు. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెడ్లబండిగా నడపడం ఇప్పుడు రాజయ్యకు సవాల్‌గా మారనున్నది.