డెంగీ మరణాల్లేవ్: డిప్యూటీ సీఎం రాజయ్య
హన్మకొండ: తెలంగాణలో ఇప్పటి వరకు డెంగీతో ఎవరూ చనిపోలేదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పారు. హన్మకొండలో మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలీజా పాజిటివ్ వచ్చినప్పుడే డెంగీ వ్యాధి వచ్చిన ట్లని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎలాజా పాజిటివ్ వచ్చిన కేసులు లేవన్నారు. అయితే ప్లేట్‌లెట్లు తగ్గితే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు డెంగీ వ్యాధి పేరుతో రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని పేర్కొన్నారు. డెంగీతో చనిపోతే ఆయూ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరైనా చనిపోతే వివరాలు అందజేయూలని సూచించారు.