కలలో కూడా ఊహించలే...
డిప్యూటీ సీఎంను అవుతానని అనుకోలే...
పొరపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ మార్పు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ : ఉప ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదు... ఎంపీలుగా సీతారాం నాయక్ తాను హాయిగా ఉన్నాం... ఇద్దరం కలి సి మారుతీ స్విఫ్ట్ ఒక్క రోజే కొనుక్కున్నాం... ఎంపీగా ఉన్న వారు డిప్యూటీ సీఎం అవుతారని ఎవరు అనుకోరు... ఇది ఒక్క కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు జనగామ నుంచి మొదలు హన్మకొండ వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా ఆహ్వానం పలికారుు. రాత్రి హన్మకొండలోని ఏకశిల పార్కులో జరిగిన సన్మాన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ 1994లో తొలిసారిగా గెలిచిన దాస్యం ప్రణయ్‌భాస్కర్, తాను ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రులమయ్యామని గుర్తు చేశారు. ఈ యువకులు ఇద్దరితో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని ఆనాడు జిల్లా ప్రజలు ఇదే విధంగా బ్రహ్మరథం పట్టారన్నారు. వీరి రుణం ఏమి చేసినా తీర్చలేనిదన్నారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని పట్టుదలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు పోతున్నారని చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ మార్పు చేశారని పేర్కొన్నారు. పగవాడి ముందు, పక్క వారి ముందు అభాసుపాలు కావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. విద్యాశాఖ తనకు ఇష్టమైన శాఖ అని.. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినపుడు గుర్తింపు తీసుకొచ్చింది ఆ శాఖేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అక్షరాస్యతలో మొదటిస్థానంలో ఉంచానన్నారు. అప్పుడు తన పనితీరు, పట్టుదల, చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ చూసి ఎంతో నమ్మకంతో రిస్క్ తీసుకుని బాధ్యతను అప్పగించారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తెలంగాణలో జిల్లాను అగ్రభాగంలో నిలబెట్టాలనే తపనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగానే టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, మురికివాడలు లేని నగరంగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టారన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడ్డదన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ పనులు పూర్తి కాలేదని విమర్శిం చారు. ఇక్కడి బొగ్గును సీమాంధ్రకు తరలించి.. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ఇక్కడేమో కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు, అప్తులను పోగొట్టుకున్నారని, వారందరినీ కాపాడుకుంటామన్నారు. సాధ్యమైన మేరకు పొరపాటు చేయనని, తెలియకుండా పొరపాటు చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీలో అందరు సమానమేనని కడియం శ్రీహరి అన్నారు. వెనకొచ్చిన, ముందు నుంచి ఉన్నా... పార్టీలో చేరాక అందరూ పార్టీ కార్యకర్తలేనన్నారు. గోదావరిలో ఎన్నో ఉపనదులు కలుస్తాయని, భద్రాచలంలో గోదావరిలోకి దిగి ఇం దులో ఏ నది అని ఎలా గుర్తిస్తారని ఉదహరించారు. అవకాశాలు సందర్భోచితంగా, సమీకరణలు బట్టి వస్తుంటాయని, రాని వారు అధైర్యపడొద్దన్నారు. అవకాశాలు వచ్చిన వారు వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎంపీగా మొదటిసారిగా గెలిచిన కల్వకుంట్ల కవిత పదవిలో ఏం రాణిస్తారని సందేహాలు వ్యక్తం చేశారన్నారు. పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగు పెట్టిన మహిళా ఎంపీల్లో పది మందిని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారని, ఇందులో కవిత పేరు కూడా ఉందన్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మా ట్లాడుతూ నాయకులందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నాయని, సమన్వయ కమిటీగా ఏర్పడి ఖాళీలు గుర్తించి వాటి భ ర్తీకి కృషి చేస్తామన్నారు. జిల్లా సమస్యలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజల్లో అభాసుపాలయ్యాయని విమర్శిం చారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి కుటుంబమన్నారు.
కుటుంబ పెద్ద ఏ బాధ్యత అప్పగించినా కూలీగా పని చేస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మార్పుతో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్ళన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి మరకపడొద్దని రాజ య్య స్థానంలో మార్పు చేశారన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మార్పు చేయాల్సి వచ్చిందన్నా రు. ఇది రాజకీయం కోసం కాదు.. ప్రజల కోసమేనని, ప్రజల కోసం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.