పెద్దాపురం :అకాల వర్షాలతో నష్టపోయిన అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం పెద్దాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణం వల్ల అనంతపురంలో భారీ వర్షాలు కురిసి, పంటనష్టం వాటిల్లిందన్నారు. నష్టం ఏ మేరకు జరిగిందో అంచనా వేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అనంతపురంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటినందున జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.
దీనిపై సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికార కార్యక్రమాలు రద్దు చేసుకుని అనంతపురం వెళుతున్నట్టు తెలిపారు. అక్కడి పరిస్థితిని పూర్తిగా పరిశీలించాక తక్షణ సాయంపై ఉన్నతాధికారులతో సమీక్షించి ఆదుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు చేతికొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, బొడ్డు బంగారుబాబు, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు పాల్గొన్నారు.
పుష్కర పనుల తనిఖీలకు ‘బాబు’ రెడీ!
రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు జరుగుతున్న వివిధ పనులను ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు ఆకస్మిక తనిఖీ చేయనున్నారు. చంద్రబాబు మే ఒకటి, రెండు తేదీల్లో రాజమండ్రి వస్తారని, తదుపరి రెండు రోజులు నగరంలో ఉండి, పుష్కర పనులను పరిశీలిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పనుల తీరుపై సమీక్షలు జరుపుతారని పేర్కొన్నాయి. ఈనెల 20 తరువాత బాబు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచాం.
అనంతపురాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
Published Fri, Apr 17 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement