Oil Factory Accident While Cleaning Tanker At Peddapuram, Kakinada - Sakshi
Sakshi News home page

Kakinada: ఆయిల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి

Published Thu, Feb 9 2023 10:18 AM | Last Updated on Thu, Feb 9 2023 12:37 PM

Kakinada Oil Factory Accident While Cleaning Tanker Peddapuram Updates - Sakshi

సాక్షి, కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలోని ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. 

మృతుల్లో అయిదుగురు పాడేరు వాసులు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15  రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement