oil factory
-
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
సాక్షి, కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతుల్లో అయిదుగురు పాడేరు వాసులు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15 రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు తెలుస్తోంది. -
Rajasthan: ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం.. జైపూర్‌లోని జామ్వా రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. Rajasthan | Three children and a man died after a fire broke out at a Turpentine oil factory in Jamwa Ramgarh, Jaipur. The fire was brought under control: CO Shiv Kumar pic.twitter.com/NEfnCgHFzM — ANI (@ANI) January 30, 2022 చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ -
శ్రీచక్ర ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
ఆయిల్ ఫెడ్‌కు బీచుపల్లి ఫ్యాక్టరీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో తాళం పడిన గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ)తో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకుంది. ఆయిల్‌ఫెడ్ రూ.8 కోట్లు చెల్లించి స్వాధీ నం చేసుకోవాల్సి ఉండగా, ఇందులో రూ.2.11 కోట్లు బుధవారం ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే రూ.3 కోట్లు చెక్కుల రూపంలో చెల్లించారు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించేందుకు ఎన్డీడీబీతో ఆయిల్‌ఫెడ్ అవగాహన కుదుర్చుకుంది. వాస్తవానికి 2011లో ఈ బీచుపల్లి మిల్లు స్థలం, బిల్డింగ్స్, ప్లాంట్, ఇతర మిషనరీ విలువ రూ.2.37 కోట్లుగా ఉందని, ఇప్పుడు రూ.8 కోట్లకు సెటిల్మెంట్ చేసుకోవడంపై మతలబు ఏముందని టీఎస్ ఆయిల్‌ఫెడ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రశ్నించింది. అలాగే బీచుపల్లి ఫ్యాక్టరీ ఉమ్మడి ఆస్తిగా ఉంది. మొదట్లో ఏర్పాటు చేసిన నాడే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినదిగా నెలకొల్పారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత దాని విభజన జరగలేదు. విభజన జరగకుండానే ఎన్డీడీబీకి అప్పులు చెల్లించడం ద్వారా భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. 2003లో మూసివేత.. వేరుశనగ నుంచి నూనె తీసి విజయవర్ధనే ఆయిల్ ప్యాకెట్లతో పేరుగాంచిన ఈ మిల్లును 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూసివేశారు. ఈ మిల్లును నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతులు ఎంతోకాలం ఆందోళన చేశారు. ఎన్డీడీబీ ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ.11.26 కోట్లతో నిర్మించారు. 2003లో మూతపడినా ఎన్డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. దీంతో ఇప్పుడు దీనిని తెరవాలని, అప్పును చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించిన తరువాత మళ్లీ వేరుశనగ నూనెతోపాటు పామాయిల్ సహా ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో రూ.కోటిన్నర ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నడుస్తుదని అంటున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. -
బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దీంతో 16 ఏళ్ల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ మళ్లీ జీవం పోసుకోనుంది. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని మూసి వేయగా, ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుండటంతో ఆయిల్‌ఫెడ్ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ. 11.26 కోట్లతో నిర్మించారు. వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారు చేసేవారు. దాన్ని జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) ఆర్థిక సహకారంతో నిర్మించారు. అయితే అది మూతపడినా ఎన్డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయితే ఇప్పుడు దాన్ని తెరవాలంటే ఎన్డీడీబీకి తీసుకున్న అప్పును చెల్లించాల్సి ఉంది. ఒకేసారి చెల్లించేలా (వన్‌టైం సెటిల్మెంట్) ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. అయితే ఎన్డీడీబీ రూ. 7.5 కోట్లు కావాలని కోరుతుండగా, ఆయిల్‌ఫెడ్ మాత్రం రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి మంగళవారం ఎన్డీడీబీ అధికారులతో సమావేశమయ్యారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల నూనె 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వేరుశనగ సాగుచేసే రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం, రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే వేరుశనగ నూనె అందించడం కోసం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. వివిధ రకాల అడ్డంకులు అధిగమించి 1990లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 135 మంది ఉద్యోగులు పనిచేశారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల వేరుశనగ నూనెసహా ఇతరత్రా నూనెలనూ ఉత్పత్తి చేసేవారు. ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నప్పటికీ సంస్కరణల పేరుతో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. దాన్ని అక్రమంగా మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అనేకమంది కార్మికులను తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి వీఆర్ఎస్ ఇచ్చి తీసేశారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడంపై అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఫ్యాక్టరీని తెరిచాక మళ్లీ వేరుశనగ నూనెతో పాటు పామాయిల్, ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడు స్తుందని అంటున్నారు. అందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. -
సీమ రైతుల ఊపిరి తీసిన చంద్రకిరణం
తీవ్ర కరువు కాటకాలతో అల్లాడే రాయలసీమ జిల్లాల్లోని వేరుశనగ రైతుల జీవితాల్లో వెలుగునింపాలన్న ఉన్నతాశయంతో ఎన్టీరామారావు ప్రభుత్వ హయాంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తే చంద్రబాబు హయాంలో క్లోజ్ చేయడంతో అటు రైతులు, ఇటు కార్మికులు తీవ్రంగానష్టపోతున్నారు. పీలేరు పట్టణ శివార్లలో రూ.40 కోట్ల వ్యయంతో 63.84 ఎకరాల్లో నిర్మించినశ్రీకృష్ణదేవరాయ నూనె విత్తుల కర్మాగారం మూతపడడం రాయలసీమ రైతుల్లో నిరాశ నింపింది.వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలన్నసంకల్పానికి తూట్లు పడింది. సీఎం హోదాలో పీలేరు నుంచే ప్రాతినిధ్యం వహించిన కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఏకంగా పరిశ్రమలోని యంత్రాలను అమ్మేశారు. నాలుగు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకుంటుండడంతోసర్వత్రా రైతులు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. చిత్తూరు: కరువుతో సతమతమయ్యే రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ రైతుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉన్నతమైన ఆశయంతో 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పీలేరులో శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ శివారు ప్రాంతం బళ్లారి–తిరుపతి జాతీయ రహదారి పక్కనే 63.84 ఎకరాల్లో పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీమలోని చిత్తూరు, కడప, అనంతపురంతోపాటు నెల్లూరు జిల్లా రైతులు పండించే వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలని సంకల్పించారు. ఆశయం ఉన్నతం కావడంతో పరి శ్రమ నిర్మాణం నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకోవడంతో 1991లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పరిశ్రమను ప్రారంభించారు. 1995 నాటికి పరిశ్రమ పనితీరు ఉచ్ఛస్థితికి చేరుకుంది. వేరుశనగ సేకరణ కోసం నాలుగు జిల్లాల పరిధిలో 360 సొసైటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో సొసైటీలో 100 మంది రైతులు సభ్యులుగా ఉండే వారు. వీరి నుంచి వేరుశనగ, పొద్దుతిరుగుడు సేకరించే వారు. ఇక్కడే వేరుశనగ, పొద్దుతిరుగుడు నుంచి ప్యూరిఫైడ్ వేరుశనగ, సన్‌ప్లవర్ ఆయిల్ తయారు చేసేవారు. రోజుకు 200 లోడ్ల వేరుశనగ సేకరించి నూనె తీసేవారు. పాలకుల నిర్లక్ష్యానికి పర్యవేక్షకుల స్వార్థం జతకావడంతో లాభాల్లో పయనించిన పరిశ్రమకు బాలారిష్టాలు మొదలయ్యాయి. 1996 తరువాత నూనెవిత్తుల కర్మాగారం పనితీరు తిరోగమనంలోకి వెళ్లింది. పరిశ్రమ నిర్వహణ కోసం ఎన్డీడీబీ నుంచి తీసుకున్నరూ.40 కోట్లు రుణం తిరిగి చెల్లించలేక పోయారు. నష్టాలను సాకుగా చూపుతూ 2003లో అప్ప టి సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో పరిశ్రను మూసివేశారు. పరిశ్రమ మూత పడే నాటికి ఇక్కడ 139 మంది రెగ్యులర్ ఉద్యోగులతోపాటు 200 మంది కాంట్రాక్ట్ సిబ్బం ది పనిచేసేవారు. వీరంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిశ్రమ మూత పడ్డప్పటి నుంచి పరిశ్రమకు కాపలాగా సెక్యూరిటీ గార్డులను నియమించారు. కొంతకాలం కేవీపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన రఘురామిరెడ్డి నూనెవిత్తుల కర్మాగారం చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం పరిశ్రమ పర్యవేక్షణ బాధ్యతలు ఐఏఎస్‌ల చేతుల్లోకి వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశ్రమను తెరిపించక పోగా.. మూతపడ్డ పరిశ్రమలో యంత్రాలు తుప్పుపడుతున్నాయంటూ మరో అడుగు ముందుకేశారు. రూ.2,15 కోట్లకు యం త్రాలను టెండర్ ద్వారా విక్రయించి చేతులు దులుపుకున్నారు. జిల్లాకే చెందిన చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి నూనెవిత్తుల కర్మాగారం తెరిపిం చాలని ఒక్కరోజు కూడా తలచక పోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం పరిశ్రమ ఉనికిని దెబ్బతీశారని రైతులు మండిపడుతున్నారు. మూతవే యవద్దని కార్మికులు, రైతులు చేసిన ప్రయ త్నాలపై చంద్రబాబు ఆరోజు నీళ్లు చల్లారని పేర్కొంటున్నారు. రైతులపై వీరికున్న శ్రద్ధ ఏపాటిదో ఇదే నిదర్శనమంటున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారంలో ఏపీ బాలికల గురుకులం, ప్రభుత్వ ఐటీఐలను నిర్వహిస్తున్నారు. ♦ శంకుస్థాపన: 1989లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ♦ ప్రారంభం: 1991లో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కర్మాగా రాన్ని ప్రారంభించి రాయలసీమ, నెల్లూ రు జిల్లాల రైతులకు అంకితం చేశారు. ♦ నిర్మాణ వ్యయం: రూ.40 కోట్లు. ప్రస్తుత విలువ రూ.100 కోట్ల పైమాటే. ♦ పరిధి: చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు. ♦ సొసైటీలు: నాలుగు జిల్లాల పరిధిలో 360 రైతు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో సొసైటీలో 100 మంది రైతులు సభ్యులుగా ఉండేవారు. ♦ పరిశ్రమ ప్రాంతం: పీలేరు మండలం, గూడరేవుపల్లె పంచాయతీ పరిధిలో పీలేరు–తిరుపతి మార్గంలో(పీలేరు పట్టణ శివారు ప్రాంతం). ♦ విస్తీర్ణం: 63.84 ఎకరాలు ♦ పరిశ్రమ మూత: నష్టాలను సాకుగా చూపి 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమానాలో పరిశ్రమను మూసివేయడంతో బాలారిష్టాలు మొదలయ్యాయి. ♦ యంత్రాల విక్రయం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2014లో నూనెవిత్తుల కర్మాగారంలోని యంత్రాలు, ఆయిల్ ట్యాంకర్లను రూ.2.5 కోట్లకు అమ్మేయడంతో పరిశ్రమలోని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ♦ పరిశ్రమ మూత నాటికి: నూనెవిత్తుల కర్మాగారం మూతపడ్డ నాటికి ఇక్కడ 139 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసేవారు. వీరంతా వీధిన పడ్డారు. బాబు హయాంలోపరిశ్రమలకు మనుగడ ఉండదు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పరిశ్రమలకు మనుగడ ఉండదు. ఉన్న పరిశ్రమలను మూ సివేయడమే బాబు దక్షత. సీమ రైతుల కోసం ఉన్నతమైన ఆశయంతో నిర్మించిన నూనెవిత్తుల కర్మాగారం మూయించడం బాబుకే చెల్లు.–చింతల రమేష్‌రెడ్డి, రైతు, కలికిరి రైతులను ఇబ్బందులకు గురిచేయడమే కరువుతో అల్లాడుతున్న సీమ రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ హయాంలో నూనెవిత్తుల కర్మాగారం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేరుశనగ రైతుల ఇక్కట్లు గుర్తించకుండా మూయించారు.–తిమ్మయ్య, రైతుతలపుల గ్రామం -
జనంపైకి జన్యు విషం!
జనం కడుపులోకి జన్యు విషం చొరబడుతోంది. బహుళజాతి సంస్థలు గుట్టుచప్పుడుగాకుండా రైతులకు అంటగట్టిన ప్రమాదకర బీజీ–3 పత్తి.. ఇప్పుడు నూనె రూపంలో గరళాన్ని చిమ్ముతోంది. బ్రాండెడ్ రకాల నూనెల్లో కలిసిపోయి కేన్సర్ కారకాలను నేరుగా వంటింటికే మోసుకొస్తోంది. వేలకొద్దీ ఆయిల్ డబ్బాల్లో ఈ నూనెను కలిపేసి, వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు అక్రమార్కులు! హైదరాబాద్ శివారుల్లోని కాటేదాన్ నుంచి బేగంబజార్లోకి, అక్కడ్నుంచి వ్యాపారులకు, వారి నుంచి ఇళ్లకు, హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, రోడ్లపై బజ్జీ దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది ఈ విషపు నూనె. అటు పశువులకు దాణాగా ఈ పత్తి పిండినే ఇస్తుండటంతో పాల రూపంలోనూ నేరుగా జనం ఒంట్లోకి ప్రవేశిస్తోంది. బీజీ–3 జన్యుమార్పిడి పత్తి నూనె, పశువుల దాణా మార్కెట్లోకి చొరబడుతున్న తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పత్తి మిల్లుల నుంచి పారిశ్రామికవాడల వరకు, అక్కడ్నుంచి జనం చెంతకు ఈ నూనె చేరుతున్న వైనంపై సమగ్ర కథనం.. వర్ధెల్లి వెంకటేశ్వర్లు బీజీ విషానికి బహుళజాతి కంపెనీలే బీజాలు వేశాయి. పత్తి మొక్కలు శనగపచ్చ పురుగుతోపాటు ఇతర చీడలను తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేశాయి. గతంలో ఉన్న బీజీ–2 పత్తి విత్తనాల్లో హెర్బిసైడ్ టాలరెంట్ జన్యువును చొప్పించి బీజీ–3 విత్తనాలను సృష్టించాయి. అంతేగాకుండా ఈ మొక్కల చుట్టూ కలుపు పెరగకుండా నిరోధించే ‘గ్లైఫోసేట్’ అనే రసాయనాన్ని రూపొందించాయి. అయితే మన దేశంలో బీజీ–3 పత్తి సాగుపై నిషేధం ఉంది. అందులో ప్రమాదకరమైన కేన్సర్ కారకాలు ఉన్నాయని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) కూడా నిర్ధారించింది. అయినా బహుళజాతి సంస్థలు దొంగచాటుగా తెలంగాణలో సుమారు 13 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి సాగయ్యేలా చేశాయి. రైతులకు తెలియకుండా, వారి ఖర్చులతోనే బీజీ–3 పత్తి సాగయ్యేలా విత్తనాలను అంటగట్టి.. సాగు ప్రయోగ ఫలితాలను పరిశీలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం కూడా రాసింది. దానిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించగా.. కమిటీ తెలంగాణలో అక్రమంగా బీజీ–3 సాగు జరిగినట్టు నిర్ధారించింది. విత్తనాలన్నీ కలగలసిపోయి.. రాష్ట్రంలో గతేడాది 47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల చొప్పున 3.76 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే బీజీ–3 సాగుచేసిన చోట ఎకరాకు సగటున నాలుగు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. అంటే 13 లక్షల ఎకరాలకుగాను 52 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. రైతులు ఈ పత్తిని సాధారణ పత్తి కిందనే జమ కట్టి విక్రయించారు. దీంతో సాధారణ పత్తి, బీజీ–3 పత్తి కలిసిపోయింది. ఇలా కలగలిసిన పత్తి జిన్నింగ్ మిల్లులకు వెళ్లగా.. పత్తి గింజలు కూడా కలిసిపోయాయి. క్వింటాల్ పత్తి నుంచి సగటున 60 కిలోల గింజలు వస్తాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 2.35 కోట్ల క్వింటాళ్ల పత్తి గింజలు ఉత్పత్తయ్యాయి. ఇందులో 50 శాతం గింజలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా దాదాపు 1.10 కోట్ల క్వింటాళ్ల గింజలను రాష్ట్రంలోనే వివిధ మిల్లుల్లో మరపడుతున్నారు. దీంతో సుమారు లక్ష టన్నుల పత్తి నూనె, 8.25 లక్షల టన్నుల పత్తి పిండి (కేక్) ఉత్పత్తవుతోంది. ఈ నూనె, పత్తి పిండిలో బీజీ–3 ఉత్పన్నమైన హెర్బిసైడ్ టోలరెంట్ ప్రొటీన్, కలుపు నివారణగా వాడే గ్లైఫో సేట్ రసాయనం అవశేషాలు ఉంటున్నాయి. రూ.750 కోట్ల నూనె వ్యాపారం అ«నధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో నెలకు 70 వేల టన్నుల మంచినూనెను వంటల్లో వాడుతున్నారు. ఇందులో 40 వేల టన్నులు గృహ అవసరాల కోసం, 30 వేల టన్నులు వ్యాపారపరమైన వంటకాలు, పదార్థాల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 20 శాతం పత్తి నూనె.. బ్రాండెడ్ నూనెలతో కలిసిపోయి వస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి నూనెను తినటానికి వీలైనదిగానే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వినియోగం ఎక్కువగానే ఉంది. అయితే అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శుద్ధి (రిఫైండ్) చేసినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమని, లేకుంటే ప్రమాదకరమైన కార్సినోజెనిక్ కారకంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో అధికారిక , అనధికారిక వ్యాపారాన్ని కలుపుకుంటే ఏడాదికి రూ.750 కోట్ల విలువైన పత్తి నూనె వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కువగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, పామాయిల్, నూనెల్లో పత్తినూనెను కలుపుతున్నారు. ఆలీవ్, ఆవ, సోయాబీన్ నూనెల్లో కాస్త తక్కువ మోతాదులో కలిపి కల్తీ చేస్తున్నారు. పత్తి పిండి రూపంలో పశువులకు.. పత్తి పిండికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 50 కిలోల పత్తి కేకును రూ.2200 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు, మేడ్చెల్, శామీర్‌పేట ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో 100 నుంచి 150 పశువుల సామర్థ్యం ఉన్న 12 డెయిరీలను ‘సాక్షి’ పరిశీలించింది. ప్రతి డెయిరీలో పత్తి పిండి దాణా పెడుతున్నారు. కిలో పత్తిపిండి, 2 కిలోల తవుడు, కిలో శనగ పిండితో కలిపి 2 పూటలు అందిస్తున్నారు. గోనె సంచుల్లో పత్తి కేకును నింపి కంపెనీ పేరు లేకుండా విక్రయిస్తున్నారు. ఈ దాణా ఎక్కువగా కరీంనగర్ నుంచి వస్తోందని డెయిరీల్లో కార్మికులు చెప్పారు. 6 డెయిరీల్లో ఇదే తరహా దాణా కన్పించింది. మిల్లుల నుంచి తీసిన కేకును శుద్ధి చేయకుండా నేరుగా గోనె సంచుల్లోకి నింపి డెయిరీలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు రూ.1,700 కోట్ల పత్తి పిండి వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. కాటన్ మిల్లు నుంచి కాటేదాన్ వరకు సాధారణ పత్తి గింజలతో కలిసిపోయిన బీజీ–3 విత్తనాలన్నీ ఆయిల్ మిల్లులకు చేరుతున్నాయి. కానీ అక్కడ్నుంచి ‘రిఫైన్’ కాకుండానే నూనె నేరుగా మార్కెట్లోకి వచ్చేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ఓ కాటన్‌మిల్లులో పత్తి గింజల నుంచి నూనె తీసే ప్రక్రియను ‘సాక్షి’ పరిశీలించింది. దీనికి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. రోజుకు 10 టన్నుల గింజలను మర ఆడించే సామర్థ్యం ఉంది. నూనె తీయటం, విక్రయించటం చట్టబద్ధమే. సగటున ప్రతి రెండ్రోజులకు ఒక ట్యాంకర్ చొప్పున ముడి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. పత్తి నుంచి తీసిన ముడి నూనెను అధీకృత రిఫైనరీ కంపెనీలకు మాత్రమే విక్రయించాలి. మిల్లులో తీసిన ప్రతి లీటర్ ముడి నూనెను ఏయే కంపెనీలకు విక్రయించారో కచ్చితంగా నమోదు చేయాలి. కానీ ఇక్కడ అది జరగటం లేదు. అడ్డూ అదుపు లేకుండా ఎవరికి పడితే వాళ్లకు విక్రయిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని మరో పారిశ్రామిక వాడలో మరో మిల్లును ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ జిన్నింగ్ మిల్లుల నుంచి క్వింటాల్‌కు రూ.1,200 చొప్పున పత్తి గింజలు తీసుకువచ్చి మరపడుతున్నారు. క్వింటాల్ గింజల నుంచి 9.5 కిలోల నూనె, 75 కిలోల పత్తి పిండి వస్తోంది. కిలో ముడి తైలానికి అధీకృత రిఫైనరీ కంపెనీలు రూ.60, అక్రమ కంపెనీలు రూ.65 చొప్పున మిల్లులకు చెల్లిస్తున్నాయి. దీంతో మిల్లుల యాజమా న్యం తమ సరుకును అక్రమార్కులకే అప్పగిస్తున్నారు ఇలా సేకరించిన ప్రతి చుక్క నూనె నేరుగా కాటేదాన్ పారిశ్రామికవాడకు తరలిపోతోంది. అడ్డమైన కెమికల్స్ కలిపి.. నకిలీ లేబుల్స్ అతికించి.. కాటేదాన్‌లో 100కు పైగా చిన్న తరహా అక్రమ రిఫైనరీ పరిశ్రమలు ఉన్నాయి. ముడి పత్తి నూనెలో ఉన్న మడ్డీని కరిగించి ఇందులో ఏవేవో రసాయనాలు కలుపుతున్నారు. ఈ రసాయనాలు ఏ పేరుతో పిలుస్తారో.. ఏం కలుపుతున్నారో అక్కడ పని చేసే కార్మికులకు కూడా తెలియదు. పలుచబడిన నూనెకు పాక్షికంగా ఆకుపచ్చ వర్ణం వచ్చే వరకు మరో రసాయనాన్ని కలుపుతున్నారు. ఈ ద్రావణాన్ని ఇతర బ్రాండెడ్ ఆయిల్స్‌తో మిక్స్ చేసి బ్రాండెడ్ భ్రమ కల్పిస్తున్నారు. నూనె డబ్బాల రిసైక్లింగ్ పేరుతో ముందుగానే వేల కొద్ది ఖాళీ ఆయిల్ డబ్బాలను సేకరిస్తున్నారు. వాటికి వివిధ కంపెనీల నకిలీ లేబుల్స్‌ను అతికించి, డబ్బాల్లో ఈ ఆయిల్ నింపి ఏమాత్రం అనుమానం రాకుండా సీల్ చేసి మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఈ సరుకు వివిధ ఏజెన్సీల ద్వారా ముందుగా బేగంబజార్‌కు చేరుతోంది. అక్కడ్నుంచి టోకు వ్యాపారులకు వారి నుంచి చిల్లర వ్యాపారులకు చేరుతోంది. వారి ద్వారా గృహాలకు, హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, రోడ్లపక్కన బజ్జీల దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు చేరిపోతోంది. ఆ పాలల్లో విషపు అవశేషాలు రాష్ట్రంలో 90.5 లక్షల ఆవు లు, కోడెలు, బర్రెలు ఉన్నాయి. వీటిలో 60 లక్షల వరకు పశువులు పాలిచ్చేవి. పాలిచ్చే పశువుల కోసం గతంలో వేరుశనగ పిండి. తవుడు కలిపి దాణాగా పెట్టేవాళ్లు. కానీ వేరుశనగ సాగు గణనీయంగా తగ్గి, పత్తి సాగు పెరగడంతో పత్తి పిండిని దాణాగా పెడుతున్నారు. ముఖ్యంగా డెయిరీల్లోని పశువులకు ఇదే ప్రధాన దాణాగా మారింది. కోళ్లకు, గొర్రెలకు కూడా దీన్ని దాణాగా వాడుతున్నారు. గింజల నుంచి తైలం తీయగా మిగిలిన కేక్‌ను పత్తి పిండిగా పిలుస్తారు. వేర్వేరు బ్రాండ్ల పేరుతో పత్తి పిండిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 6.5 వేల టన్నుల పిండిని దాణాగా వాడుతున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. జన్యు మార్పిడి కోసం వాడిన హెర్బిసైడ్ టాలరెంట్ ప్రొటీన్, గ్లైఫోసేట్ అవశేషాలు పూర్తిగా ఇందులోనే ఉంటాయి. దీన్ని తిన్న పశువుల్లో జన్యు ఉత్పరివర్తనాలు రావటంతో పాటు ప్రమాదకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజీ–3 పత్తి విత్తన ఆధారిత పదార్థాలను పశువులకు పెట్టకుండా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించడం గమనార్హం. బీజీ–3 పత్తి పిండి తిన్న పశువుల పాలలో జన్యు విష రసాయనాల అవశేషాలు ఉంటాయని, వాటిని తాగితే అవి కార్సినోజెనిక్ ఏజెంట్లుగా మారి కేన్సర్ సోకే లక్షణాలను రెట్టింపు చేస్తాయని ఇటీవలి పరిశోధనలు బయటపెట్టాయి. ఎలుకలపై ప్రయోగాల్లో ఏం తేలిందంటే.. జన్యుమార్పిడి పంటల నుంచి తీసిన నూనెలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఇప్పటివరకైతే పూర్తిస్థాయి పరిశోధన జరుగలేదుగానీ.. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధక సంస్థ మాత్రం (ఐఏఆర్సీ) బీజీ–3 గింజల ఆధారిత పదార్థాలు కేన్సర్ కారకాలేనని నిర్ధారించింది. విత్తనాల్లోకి చొప్పించిన హెర్బిసైడ్ టాలరెంట్ ప్రొటీన్, జన్యుపరంగా మార్పు చెందిన గ్లైఫోసేట్ అత్యంత ప్రమాదకర కేన్సర్ ఏజెంట్లే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు చేసింది. ఎలుకలను పదే పదే గ్లైఫోసేట్ ప్రభావానికి గురిచేసి పరీక్షించగా.. మగ ఎలుకల్లో అరుదైన కణితి, ఆడ ఎలుకల్లో మూత్ర నాళాల్లో కేన్సర్ సోకేందుకు సానుకూలమైన మార్పు ను ప్రేరేపించినట్లు గుర్తించారు. క్షీరదాలలోని క్రోమోజోమ్ నష్టం, జన్యు ఉత్పరివర్తన అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు. గ్లైఫోసేట్ సమ్మేళనాలు చల్లిన క్షేత్రా ల్లో పని చేసిన వ్యవసాయ కార్మికుల నుంచి తీసిన రక్తం, మూత్ర నమూనాల్లో అమీనోమైథైల్ఫాస్ఫరిక్ యాసిడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇది కణజాల క్షయాన్ని ప్రేరేపిస్తోందని ఐఏఆర్సీ ఈ కారణాల నేపథ్యంలోనే మన దేశంలో బీజీ–3 పత్తి సాగును కేంద్రం నిషేధించింది. జీర్ణ వ్యవస్థపై హానికర ప్రభావం ఇలాంటి నూనెల ప్రభావంతో డ్రాప్సీ వ్యాధి రావ టానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్లైఫోసేట్ జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నూనె కల్తీ కావడంతో హెపటైటిస్ బి (కామెర్లు) రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.. – డాక్టర్ మధుసూదన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు శుద్ధి చేసింది అయితే మంచిదే.. పత్తి నూనెకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు ఉంది. శుద్ధి (రిఫైన్) చేసిన నూనె ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పత్తి నూనె వినియోగం ఎక్కువగా ఉంది. వేరుశనగ, నువ్వుల నూనెలను శుద్ధిచేయకపోయినా ఆహారంలో వినియోగించొచ్చు. కానీ బీజీ–3 పత్తి నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిండి (కేక్)లో హెర్బిసైడ్ టాలరెంట్ ఇతర రసాయన అవశేషాలు ఉంటాయి. వాటిని నేరుగా పశువులకు పెట్టడం ప్రమాదకరం – డాక్టర్ ప్రసాద్, ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్యానల్ కమిటీ జాతీయ చైర్మన్ -
ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని పారిశ్రామిక వాడలో ఉన్న వీరయ్య ఆయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పక్కనే ఉన్న మరో రెండు గొడౌన్లకు వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విషవాయువు లీక్ : ముగ్గురు మృతి