నేడు డిప్యూటీ సీఎం రాజయ్య రాక | RAJAIAH today arrival of the Deputy Chief | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం రాజయ్య రాక

Published Thu, Jun 26 2014 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

RAJAIAH today arrival of the Deputy Chief

భద్రాచలంలో ఐటీడీఏ పథకాలపై సమీక్ష
 సాక్షి, ఖమ్మం: ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. హన్మకొండ నుంచి బయలు దేరి ఉదయం 8 గంటలకు ఆయన ఇల్లెందు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి భద్రాచలం వెళ్లి ఉదయం 10.30 గంటలకు సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అమలవుతున్న పలు పథకాలపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే వైరాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆయనను అధికారులతో పాటు, రాజకీయ పార్టీల నాయకులు కలుసుకున్న అనంతరం వైద్యులు సన్మానించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement