మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దర్బార్‌లో ప్రతీ ముస్లిం ఓ డిప్యూటీ సీఎమ్మేనని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం రాత్రి మెదక్ పట్టణంలోని భారత్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మైనార్టీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు మహర్ధశ వచ్చిందన్నారు.
మునుపెన్నడు లేని విధంగా కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 51 వేలు, బడ్జెట్‌లో మైనార్టీలకు వెయ్యి కోట్లు, నిరుద్యోగులకు రూ.1 లక్ష ఉపాధి రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు.ముస్లింల సంస్క ృతిని తెలియని టీడీపీ మద్దతిస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి ఓటేయ్యడం వృథా అన్నారు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ని జాం హయాంలోనే రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లు, ఆస్పత్రులు, విద్యాలయాలు కట్టారని తెలిపారు. అందుకే తెలంగాణలో గల ఐదు జిల్లాల పేర్లు ముస్లిం పాలకులవే ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ గరీబ్ పార్టీ కాదని, అది గర్కే పార్టీ అని తెలిపారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనం చేయ డం తగదన్నారు.
జగ్గారెడ్డి వల్ల వందలాది మంది ఉద్యమకారులు తమ మర ణవాగ్మూలం రాసి చనిపోయారన్నారు. మెదక్ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల పాలన లో మైనార్టీలు ఆర్థికంగా చితికి పోయారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మహ్మద్ సమీర అనే యువతి పెళ్లికి డ బ్బులు లేక మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకోవడం పేదరికానికి నిదర్శనమన్నారు.
రాష్ట్ర కార్యదర్శి దేవేం దర్‌రెడ్డి మాట్లాడుతూ ఈసారి మెదక్ ముస్లింలు ఓట్లన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్థికే వేసి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ దేశ్య నాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టమధు, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, గంగాధర్, కౌన్సిలర్లు సులోచన, గాయత్రి, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షు లు సంజీవులు నాయక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధన్‌రాజ్ నాయక్ పాల్గొన్నారు.
ప్రతీ ముస్లిం డిప్యూటీ సీఎమ్మే..
Published Sat, Sep 6 2014 11:33 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement