డిప్యూటీ సీఎంను కలిసిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు | Andhra Kabaddi Association members met Deputy Chief Minister | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంను కలిసిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు

Jun 16 2014 2:15 AM | Updated on Sep 2 2017 8:51 AM

డిప్యూటీ సీఎంను కలిసిన  ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు

డిప్యూటీ సీఎంను కలిసిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు

ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

చినగంజాం: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుఛ్చాన్ని అందించారు.
 
డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఆంధ్ర కబడ్డీ చైర్మన్ పర్వతరెడ్డి శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వీర్లంకయ్య, ట్రెజరర్ రంగారావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి శిఖరం రాంబాబు, తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ కోచ్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైస్ ప్రసిడెంట్ అంజిరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్స్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement