అభిమానులనుద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెంలో శనివారం సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. గణేష్ టెంపుల్ ఏరియాలో వస్త్ర షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. అన్ని ఫ్లోర్లలోని చీరలను చూశారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బతుకమ్మను తలపై పెట్టుకుని, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు రెండోసారి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన వస్త్ర షాపింగ్ మాల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాల్‌ను అందరూ ఆదరించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నటించేటప్పుడు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. తనను చూసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.