- 600 మెగావాట్ల ప్లాంట్‌లో సీఓడీ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం
- జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి
గణపురం(వరంగల్ జిల్లా): కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లోని రెండవదశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రకటించి జాతికి అంకితం చేసినట్లు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీలో గురువారం జరిగిన ఒప్పంద పత్రంపై జెన్‌కో, ట్రాన్స్‌కో డిస్కం, గ్రిడ్‌ల ఉన్నత స్థాయి అధికారులు సంతకాలు చేశారు. గురువారం నుంచి రెండవదశ 600మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వ్యాపారత్మకంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులను, కార్మికులను, ఉద్యోగులను జెన్‌కో సీఎండీ అభినందించారు.
జనవరి 5న కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. వాస్తవానికి అప్పటికే ప్లాంట్‌లో సీఓడీ ప్రకటించాలి. కొన్ని సాంకేతిక సమస్యల మూలంగా 80రోజుల సమయం పట్టింది. ప్లాంట్‌లో 600మెగావాట్ల లక్ష్యం మేరకు 72గంటల పాటు ఆటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం కాంట్రాక్ట్ కంపెనీ బీహెచ్‌సీఎల్ జెన్‌కోకు అప్పగించింది. జెన్‌కో అధికారులు తదనంతర కార్యక్రమాలు పూర్తిచేసి విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, చంద్రమౌళి, మంగేష్, సత్యనారాయణ, పీఆర్‌ఓ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
కేటీపీపీ రెండోదశ జాతికి అంకితం
Published Thu, Mar 24 2016 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement