Joint entrance exam
-
‘జేఈఈ పరీక్ష’ అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ–మెయిన్స్)–2021 పరీక్ష నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కేసు నమోదుచేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు సిద్దార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్షిణి, ముగ్గురు ఉద్యోగులు, అక్రమాల్లో లబ్ది పొందారని భావిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ల్లో సీటు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.12–15 లక్షలు తీసుకునేలా నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హరియాణాలోని సోనీపట్‌లో ముందే ఎంపిక చేసిన జేఈఈ (మెయిన్స్) ఎగ్జామ్ సెంటర్లోనే పరీక్ష రాస్తున్న విద్యార్థుల క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలకు రిమోట్ యాక్సెస్ ద్వారా వేరే చోటు నుంచి జవాబులు అందిస్తారు. ఇలా డబ్బులు ముట్టజెప్పే అభ్యర్థులు ఎన్ఐటీల్లో సీటు సాధించేలా పథక రచన చేశారు. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థుల నుంచి పూచీకత్తుగా వారి పది, 12వ తరగతి మార్కుల సర్టిఫికెట్లు, వారి పాస్వర్డ్లు, సీటు దక్కితే తర్వాత నగదుగా మార్చుకునేలా ‘పోస్ట్ డేటెడ్’ చెక్‌లు నిందితులు ముందే తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆరు రాష్ట్రాల్లో సంస్థకు సంబంధించిన 19 వేర్వేరు ప్రాంతాల్లో తమ అధికారులు సోదాలు నిర్వహించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషి చెప్పారు. ఢిల్లీ, ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్‌పూర్‌లలోనూ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 25 ల్యాప్‌టాప్‌లు, 7 పర్సనల్ కంప్యూటర్లు, 30 చెక్‌లు, డిగ్రీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జోషి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్స్) నిర్వహిస్తారు. -
భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షల నాణ్యతా ప్రమాణాల్ని బ్రిటన్‌కు చెందిన బెల్ఫాస్ట్ యూనివర్సిటీ పరిశీలిస్తోంది. తమ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రమాణాలకు లోబడి భారత్‌లో ఏయే యూనివర్సిటీల ఎంట్రన్స్ పరీక్ష స్కోర్లు ఉంటాయో అన్వేషిస్తున్నామని బెల్ఫాస్ట్ వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ చెప్పారు. భారత్‌లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో విద్యార్థులు సాధించిన స్కోర్లనే తమ వర్సిటీలో ప్రవేశ పరీక్షకు అర్హతగా పరిగణిస్తామని గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర ఎంట్రన్స్ పరీక్షల నాణ్యతను పరిశీలించడానికి ఇప్పుడు సిద్ధమైంది. ‘ప్రతిభగల విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం భారత్‌లో విశ్వసనీయత కలిగిన ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చే స్కోర్లు తమ వర్సిటీకి ఎంతవరకు పనికి వస్తాయో పరీక్షించి చూస్తున్నాం. అలాగని మేము ఏ యూనివర్సిటీని తగ్గించి చూడటం లేదు. మా యూనివర్సిటీ ప్రమాణాలకు సరితూగే ఎంట్రన్స్ పరీక్షల స్కోర్ల కోసం చూస్తున్నాం’’అని చెప్పారు. యూకే ప్రభుత్వం భారత్ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్ని సరళీకృతం చేయడంవల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు, యూకేకి మంచే జరుగుతుందని వీసీ చెప్పారు. భారత్‌లో నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలను గుర్తించడానికి ఇక్కడ కొన్ని సంస్థల్ని భాగస్వాములుగా చేసుకొని అన్వేషణ కొనసాగిస్తున్నట్టు గ్రీర్ వెల్లడించారు. -
కేటీపీపీ రెండోదశ జాతికి అంకితం
- 600 మెగావాట్ల ప్లాంట్‌లో సీఓడీ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం - జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి గణపురం(వరంగల్ జిల్లా): కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లోని రెండవదశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రకటించి జాతికి అంకితం చేసినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీలో గురువారం జరిగిన ఒప్పంద పత్రంపై జెన్కో, ట్రాన్స్‌కో డిస్కం, గ్రిడ్ల ఉన్నత స్థాయి అధికారులు సంతకాలు చేశారు. గురువారం నుంచి రెండవదశ 600మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వ్యాపారత్మకంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులను, కార్మికులను, ఉద్యోగులను జెన్కో సీఎండీ అభినందించారు. జనవరి 5న కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. వాస్తవానికి అప్పటికే ప్లాంట్‌లో సీఓడీ ప్రకటించాలి. కొన్ని సాంకేతిక సమస్యల మూలంగా 80రోజుల సమయం పట్టింది. ప్లాంట్‌లో 600మెగావాట్ల లక్ష్యం మేరకు 72గంటల పాటు ఆటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం కాంట్రాక్ట్ కంపెనీ బీహెచ్సీఎల్ జెన్కోకు అప్పగించింది. జెన్కో అధికారులు తదనంతర కార్యక్రమాలు పూర్తిచేసి విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, చంద్రమౌళి, మంగేష్, సత్యనారాయణ, పీఆర్ఓ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ పరీక్షలో కీలక మార్పులు
పరీక్ష కేంద్రంలోనే పెన్నుల సరఫరా హన్మకొండ(వరంగల్ జిల్లా): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)లో కీలక మార్పులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు సరఫరా చేయాలని సెంటర్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు సాంతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో కాపీయింగ్‌కు తావు లేకుండా ఈసారి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా నిబంధనలు కఠినతరం చేశారు. అభ్యర్థులు వెంట తీసుకొచ్చే పెన్నులు, పెన్సిళ్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. క్రేయూన్స్, కలర్ పెన్నులకు మాత్రం అనుమతిస్తారు. వారు లోనికి వెళ్లేముందు స్కానర్లతో క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. పరీక్ష గదిలోకి షూస్‌ను సైతం అనుమతించడం లేదు. షూస్ వేసుకొస్తే బయటనే విడిచి వెళ్లాలి. చెప్పుల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు, రిస్ట్‌వాచ్‌లను సైతం అనుమతించరు. పరీక్ష గదిలోనే గోడ గడియారాలను అందుబాటులో ఉంచుతారు. ఇన్విజిలేటర్లకు సైతం సెల్ఫోన్ల అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 59,371 మంది అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కేంద్రాలలో ఆఫ్‌లైన్ పద్ధతిన జరిగే జేఈఈ పరీక్షకు మొత్తం 59,371 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి పేపర్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, బీ-ఆర్క్ విభాగానికి సంబంధించిన రెండో పేపర్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పెన్నులు, వాచీలు తెచ్చుకోవద్దు. జేఈఈ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి నిబంధనలను మార్చారు. పరీక్ష కేంద్రంలోకి పెన్నులు, పెన్సిళ్లు, వాచీలను అనుమతించడం లేదు. విద్యార్థులకు అవసరమైన పెన్నులు పరీక్ష గదిలో అందిస్తాం. ప్రతి గదిలో గోడ గడియారం ఏర్పాటు చేస్తాం. - జి.మథ్యాస్‌రెడ్డి (జేఈఈ వరంగల్ సెంటర్ కో ఆర్డినేటర్)