గోరటి వెంకన్నకు ‘కాళోజీ’పురస్కారం | kalooji award to gorati venkanna | Sakshi
Sakshi News home page

గోరటి వెంకన్నకు ‘కాళోజీ’పురస్కారం

Published Sat, Sep 3 2016 12:16 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

పాటతో చిందేస్తున్న గోరటి వెంకన్న - Sakshi

పాటతో చిందేస్తున్న గోరటి వెంకన్న

  • మట్టి మనిషి కిరీటంలో మరోతురాయి
  • పాలమూరు మట్టిబిడ్డకు మరో గౌరవం
  • తెలకపల్లి/మహబూబ్‌నగర్‌ కల్చరల్‌: ‘పల్లే్లకన్నీరు పెడుతుందో’ అని విలపించినా, ‘వాగులెండిపాయేరా’ అని బాధపడినా, ‘సంత మావురు సంతా’ అని సంబరపడినా, ‘ఏమిమారే ఏమీమారేరా’ అని చింతచేసినా గోరటి వెంకన్న పాట వినిపిస్తుంది. ప్రముఖ కవి, సినీగేయ రచయిత, ప్రకృతి కవి, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ప్రభుత్వం భాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆయనకు ఈ అందజేయనున్నారు. గోరటి వెంకన్న తెలకపల్లి మండలం గౌరారం స్వగ్రామం. ఆయన చిన్నతనం నుంచే తండ్రి గోరటి నర్సింహ్మ, తల్లి ఈరమ్మ యక్షగానం, భజన కీర్తనలు, మంగళ హారతుల పాటలతో వెంకన్న మనసును పాటల వైపు మళ్లింది. పచ్చటి పల్లెపొలాలు, దుందుభీ వాగు తీరాన్ని చూస్తూ పెరిగిన ఆయన ప్రకృతే తన పాటకు వస్తువుగా మార్చుకున్నారు. వెంకన్న విద్యాభ్యాసం జిల్లాలోనే కొనసాగింది. ప్రస్తుతం ఆయన నాగర్‌కర్నూల్‌ డివిజన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటడమే కాక స్వరాష్ట్ర ఆవశ్యకతను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వెంకన్న పాటలు ఆకట్టుకుంటాయి. అచ్చతెలుగు మాండలికానికి చిరునామా గోరటి వెంకన్న. మన బాస, యాసను మరిచిపోతున్న తరుణంలో ఆయన రాసిన ప్రతి గేయంలో, పాటలో మాండలిక గుభాళిలిస్తాయి.  
      
     పల్లె పాటలకు ప్రాణం
    1984లో ‘నీ పాట ఏమాయెరో కూలన్నా, నీ ఆట ఎటుపాయెరో మాయన్నా’ అంటూ మొదటిసారి రాసిన పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. 
    ‘రాజహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో’ అనే పాట ప్రముఖ సినీదర్శకుడు శంకర్‌ను ఆకర్షించింది. ఆయన పాటలు రాయాలని పట్టుబట్టడంతో ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాకు ‘జైబోలో.. జైబోలో అమరవీరులకు జైబోలో’ అంటూ అమరవీరులను స్మరిస్తూ పాటరాశారు. అప్పట్లో ఏ నోట విన్నా ఇదే పాట మార్మోగింది. ‘కుబుసం’లో పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అంటూ పల్లెగోషను వినిపించారు. ఆ పాటే వెంకన్నకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. దీంతోపాటు ఆర్‌.నారాయణపూర్తి సినిమాల్లో లెక్కకుమించి పాటలెన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వెంకన్న పాటలేని ధూం..ధాం కార్యక్రమమే లేదు. ‘మందెంట పోతుంటే ఎలమంద’, ‘సేతానమేడుందిరా సేలన్నీ బీడాయెరా’, ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది, జిల్లేడన్నా జిట్టా’, గుమ్మాలకు బొమ్మలోలె..’ ‘ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా’, ‘ఇండియా పాకిస్తాన్‌ వలె ఇనుప కంచె పడుతుందా’ అనే పాటలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 
     
    పురస్కారాలు..
    తాత్వికుడిగా, వాగ్గేయకారుడిగా పాటలతో విశిష్టతను సాధించుకున్న గోరటి అనేక పురస్కారాలు అందుకున్నారు. 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హంస పురస్కారం అందించి ఘనంగా సత్కరించింది. 2014లో కర్ణాటకకు చెందిన లంకేష్‌ సాహితీ సమితి జాతీయ పురస్కారం అందుకున్నారు. డాక్టర్‌ సినారే సాహితీ సంస్థ పురస్కారం దక్కించుకున్నారు. అధికార భాషా సంఘం 2007లో తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గేయకావ్యం, తెలుగు సాహిత్య అవార్డును అందించింది. అపర కష్ణశాస్త్రి, విశాలాంధ్ర, తెరా ఇటీవల ఖమ్మంలో జీవితసాఫల్య పురస్కారం అందించింది. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement