ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు
కర్నూలు : ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన 23 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జీవనోపాధి శిక్షణకు వెళ్లారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వారు ఎస్పీ ఆకె రవికృష్ణను కలిశారు. గ్రామానికి చెందిన ప్రతి మహిళ ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. పేపర్ ప్లేట్లు, ఇటుకలు, పచ్చళ్లు, రెడిమేడ్ డ్రస్సులు తయారీ, సోలార్ లైట్లు, జ్యూట్ బ్యాగులు, సబ్బుల తయారీపై శిక్షణ పొందనున్నారు. కార్యక్రమంలో కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, గ్రామ జ్యోతి ప్రాజెక్డు డైరెక్టర్ అబ్దుల్ సలాం పాల్గొన్నారు.