మన వాటా రూ.265 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.1290 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో కరీంనగర్ జిల్లాకు రూ.265 కోట్లు రానున్నాయి. రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యశాఖ మంత్రి నరేంద్రసింగ్ ఈ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ లేఖ పంపారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత ఈ నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. కేంద్రం సూత్రప్రాయ అంగీకారంతో జిల్లాలోని మహదేవపూర్, కాటారం, కాళేశ్వరం, తుపాకులగూడెం, ముకునూరు, కన్నెపల్లి, కనుకునూర్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాన్ని రహదారుల, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టనున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఆర్‌అండ్‌బీ అధికారులు పంపిన ప్రతిపాదనలు
–––––––––––––––––––––––––––
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు టైప్ దూరం వ్యయం
–––––––––––––––– –––––– ––––– ––––
1.మహదేవపూర్– కాటారం సింగిల్ లేన్ 30కి.మీ. రూ.45 కోట్లు
వయా ముకునూర్, కనుకునూర్ మెటల్‌రోడ్
(0–30 కి.మీ)
2.మహదేవపూర్–కాటారం సింగిల్ లేన్ 26 కి.మీలు రూ.50 కోట్లు
వయా ముకునూర్–కనుకునూర్ మెటల్ రోడ్
(79–105 కి.మీ)
3. పెగడపల్లి–కన్నెపల్లి సింగిల్‌లేన్ 25 కి.మీలు రూ.40 కోట్లు
(0–25 కి.మీ) మెటల్‌రోడ్
4. కమాన్‌పథ్–ముకునూర్ సింగిల్ లేన్ 21 కి.మీలు రూ.30 కోట్లు
వయా తుపాకులగూడెం మెటల్‌రోడ్
(0–21 కి.మీ)
5.ఖమ్మంపల్లి–తాడిచెర్ల ఎండీఆర్ 0.9 కి.మీలు రూ.100 కోట్లు
(0/3–1/2 కి.మీ.)
(మానేరువద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం) ––––– ––––––
మొత్తం 102 కి.మీలు రూ.265 కోట్లు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––