- ప్రధాన రహదారిపై వంటావార్పుతో నిరసన
కాటారం డివిజన్ సాధన ఉద్యమం ఉధృతం
Published Mon, Sep 12 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
కాటారం: కాటారం రెవెన్యూ డివిజన్ సాధనకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగులు, కులసంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఎనిమిది రోజులుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలో భాగంగా సోమవారం మండల మున్నూరు కాపు సంఘం నాయకులు కూర్చున్నారు. ప్రధాన కూడలి వద్ద ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. అఖిలపక్షం నాయకులు రోడ్డుపై వంటలుచేసి భోజనం చేశారు. అఖిలపక్షం సాధన కమిటీ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీఆర్‌ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ నాలుగు మండలాలపై ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం కాటారం డివిజన్ ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. దీనికోసం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. డివిజన్ ఏర్పాటుకోసం ఎమ్మెల్యే తమతో కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి రాజేశ్వరరావు, వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ పంతకాని సమ్మయ్య, ముకాస నాయకులు దబ్బెట రాజేశ్, కొట్టె ప్రభాకర్, కొట్టె శంకరయ్య, పసుల శంకర్, చీమల రాజు, చీమల సందీప్, కొట్టె శ్రీశైలం, బెల్లంకొండ రామన్న, కొట్టె శ్రీహరి, కొట్టె బాపు, జాగర్ల అశోక్, సర్పంచ్ కాల్వ రాజయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement