ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు | Keesara MRO warning to land grabbers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

Published Fri, Aug 21 2015 10:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Keesara MRO warning to land grabbers

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ అంశంపై విచారణకు ఆదేశించినట్లు స్థానిక ఎమ్మార్వో సీహెచ్ రవీంద్రరెడ్డి శుక్రవారం వెల్లడించారు. కీసర మండలంలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రవీంద్రరెడ్డి హెచ్చరించారు. అయితే రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేత శ్రీనివాస్పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement