14 అడుగులకు కోయిల్‌సాగర్ నీటిమట్టం
Published Thu, Aug 4 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
14 అడుగులకు కోయిల్‌సాగర్ నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 14 అడుగులకు చేరుకుంది. రోజు రోజుకు నీటిమట్టం పెరుగుతుండడంతో రైతులు ఆనందలో మునిగి పోయారు. ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండించు కోవచ్చని రైతులు భావిస్తున్నారు. గత నెల 21 వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తరువాత జూరాల నుంచి కృష్ణా జలాలలను పంపింగ్ చేస్తున్నారు. మరో వైపు పెద్ద వాగు ద్వారా వరద జలాలు ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. రెండు వైపుల నుంచి వస్తున్న నీటిప్రవాహం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతూ వస్తున్నది. ఇంతకు ముందు ప్రాజెక్టులో 8 అడుగుల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం మరో 6 అడుగులు పెరిగి 14 అడుగులకు చేరింది. ప్రాజెక్టు షెట్టర్ల లెవల్ వరకు 32.6 అడుగులుగా ఉండగా పాత అలుగు స్థాయి 27 అడుగులుగా ఉంది. మరో 13 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి నీటి మట్టం చేరుకుంటుంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్ పంటలు పండించే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement