కొమురవెల్లిలో భక్తుల సందడి
► మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆషాడమాసంలో దర్శిం చుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం రాష్ట్రంలోని సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వరంగల్, హైదరా బాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొమురవెల్లిలో ఉదయం భక్తులు ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడేల స్తంభం వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
కొందరు భక్తులు భోనాలు తీసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మలకు ఓడిబియ్యం పోశారు. భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ రామకృష్ణరావు, అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.