Komuravelli Temple
-
కొమురవెల్లిలో బ్లాస్టింగ్లు!
సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులోభాగంగా గుడి పక్కన కొండ రాళ్లు తొలగించడానికి సదరు కాంట్రాక్టర్ బ్లాస్టింగ్లు జరుపుతుండటంతో ఆదివారం ఆలయ కార్యాలయానికి, స్థానిక భవనాల గోడలకు బీటలువారాయి. దీంతో స్వామివారి మూల విరాట్టుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. పదేపదే బ్లాస్టింగ్లు చేయడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదం బారిన పడే అవకాశముందని, బ్లాస్టింగులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ఆలయ అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈవోకు వినతి పత్రం అందించడానికి వెళ్లిన సమయంలో బ్లాస్టింగ్ జరిగి పెద్ద బండరాయి వచ్చి ఆలయ కార్యాలయం వద్ద పడింది. ఈ విషయంపై ఈవో బాలాజీని వివరణ కోరగా తక్షణమే బ్లాస్టింగ్‌ను నిలిపివేసి, కెమికల్‌తో బండరాళ్లను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
► మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆషాడమాసంలో దర్శిం చుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం రాష్ట్రంలోని సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వరంగల్, హైదరా బాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొమురవెల్లిలో ఉదయం భక్తులు ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడేల స్తంభం వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు భోనాలు తీసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మలకు ఓడిబియ్యం పోశారు. భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ రామకృష్ణరావు, అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. -
కొమురవెల్లి ఆలయంలో గోవులను సంరక్షించాలి
• ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా • విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్: కొమురవెల్లి దేవాలయంలో భక్తులు సమర్పిం చే ఆవులను కబేళాలకు తరలించడం దురదృష్టకరమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గోవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు స్వామిజీ తెలిపారు. హైదరాబాద్ చందానగర్‌లోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం లో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం గురువారం వైభవంగా నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతి శారద మాత పీఠ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు, దేవాలయాల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నా.. కొమురవెల్లిలో మాత్రం దారుణం జరుగుతోందన్నారు. గోసంరక్షణ ద్వారా అంతా మంచే జరుగుతుందన్నారు. గోవధ మంచిది కాదని, వాటి ఏడుపు రాష్ట్రానికి కీడు చేస్తుందని అన్నారు. భక్తులు సమర్పించే గోవుల ద్వారా వచ్చే పాలను దేవతామూర్తులకు వినియోగించాలని కోరారు. విదేశీ విద్య సరికాదు: ప్రస్తుత ప్రభుత్వాలు, కొంతమంది హిందూవాదులమని చెప్పుకొనేవారు ఆధ్యాత్మిక వ్యాపా రాలు చేస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయాలకు, ఆచా రాలకు తిలోదకాలిచ్చి యువతీ యువకుల ను, కుటుం బాలను మోసం చేస్తున్నారన్నారు. భారతీయ సంప్రదా యంతో కూడిన చదువులను వదిలేసి, విదేశీ పద్ధతులకు అనుగుణంగా విద్యను అందించడం సరికాదన్నారు. రామాయణం, భారతం, భగవద్గీత, మనిషి జీవన విధానాలకు ఉపకరించే వేదాలను ఇచ్చిన దేశం మనదని గుర్తు చేశారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో గురువారం చండీహోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నవగ్రహ పుండలిని హోమం, సుబ్రహ్మణ్య హోమం తదితర ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.