కొమురవెల్లి ఆలయంలో గోవులను సంరక్షించాలి
• ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా
• విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
హైదరాబాద్: కొమురవెల్లి దేవాలయంలో భక్తులు సమర్పిం చే ఆవులను కబేళాలకు తరలించడం దురదృష్టకరమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గోవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు స్వామిజీ తెలిపారు. హైదరాబాద్ చందానగర్‌లోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం లో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం గురువారం వైభవంగా నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతి శారద మాత పీఠ పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామిజీ మాట్లాడుతూ కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు, దేవాలయాల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నా.. కొమురవెల్లిలో మాత్రం దారుణం జరుగుతోందన్నారు. గోసంరక్షణ ద్వారా అంతా మంచే జరుగుతుందన్నారు. గోవధ మంచిది కాదని, వాటి ఏడుపు రాష్ట్రానికి కీడు చేస్తుందని అన్నారు. భక్తులు సమర్పించే గోవుల ద్వారా వచ్చే పాలను దేవతామూర్తులకు వినియోగించాలని కోరారు.
విదేశీ విద్య సరికాదు: ప్రస్తుత ప్రభుత్వాలు, కొంతమంది హిందూవాదులమని చెప్పుకొనేవారు ఆధ్యాత్మిక వ్యాపా రాలు చేస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయాలకు, ఆచా రాలకు తిలోదకాలిచ్చి యువతీ యువకుల ను, కుటుం బాలను మోసం చేస్తున్నారన్నారు. భారతీయ సంప్రదా యంతో కూడిన చదువులను వదిలేసి, విదేశీ పద్ధతులకు అనుగుణంగా విద్యను అందించడం సరికాదన్నారు. రామాయణం, భారతం, భగవద్గీత, మనిషి జీవన విధానాలకు ఉపకరించే వేదాలను ఇచ్చిన దేశం మనదని గుర్తు చేశారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో గురువారం చండీహోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నవగ్రహ పుండలిని హోమం, సుబ్రహ్మణ్య హోమం తదితర ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.