సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులోభాగంగా గుడి పక్కన కొండ రాళ్లు తొలగించడానికి సదరు కాంట్రాక్టర్ బ్లాస్టింగ్‌లు జరుపుతుండటంతో ఆదివారం ఆలయ కార్యాలయానికి, స్థానిక భవనాల గోడలకు బీటలువారాయి.
దీంతో స్వామివారి మూల విరాట్టుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. పదేపదే బ్లాస్టింగ్‌లు చేయడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదం బారిన పడే అవకాశముందని, బ్లాస్టింగులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ఆలయ అధికారులను కోరుతున్నారు.
ఈ విషయమై ఆలయ ఈవోకు వినతి పత్రం అందించడానికి వెళ్లిన సమయంలో బ్లాస్టింగ్ జరిగి పెద్ద బండరాయి వచ్చి ఆలయ కార్యాలయం వద్ద పడింది. ఈ విషయంపై ఈవో బాలాజీని వివరణ కోరగా తక్షణమే బ్లాస్టింగ్‌ను నిలిపివేసి, కెమికల్‌తో బండరాళ్లను తొలగించాలని సూచించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment