విశేషాలంకరణలో కపిలేశ్వరస్వామి(ఫైల్)
26న కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
Published Fri, Aug 19 2016 7:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో శ్రీకామాక్షి అమ్మవారికి ఈ నెల 26న లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకు మార్చన నిర్వహిస్తారు. తర్వాత నైవేద్యం, హారతి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన నిర్వహిస్తారు. అనంతరం నివేదన, దీపారాధన, హారతి ఉంటుంది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు. రూ.200 చెల్లించి ఇద్దరు గృహస్తులు కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement