
లారీ – బస్సు ఢీ
పుల్లంపేట: మండలంలోని కడప–చెన్నై జాతీయరహదారిలో గురువారం ఉద యం 9గంటలకు జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కోడూరు నుంచి రాజంపేటకు వెళ్లే ఏపీ28–జెడ్–1441నెంబరుగల ఆర్టీసీ బస్సు రెడ్డిపల్లి సమీపానికి రాగానే కడప నుంచి చెన్నైకు వెళుతున్న యూపీ–3191 నెంబరుగల లారీ బస్సును ఢీకొంది. దీంతో ఒక వృద్ధుడు మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. మృతుడు పులిగంగయ్య (73), దాసరపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరారైన లారీ డ్రైవర్‌ను పట్టుకుని కేసు నమోదుచేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.