చెట్టును ఢీకొన్న బస్సు | bus accident in kolcharam | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బస్సు

Published Sat, May 21 2016 5:17 AM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

చెట్టును ఢీకొన్న బస్సు - Sakshi

చెట్టును ఢీకొన్న బస్సు

ఒకరి మృతి 17 మందికి తీవ్రగాయాలు
ఐదుగురి పరిస్థితి విషమం
డ్రైవర్ నిర్లక్ష్యంతో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
క్షతగాత్రుల రోదనలతో దద్ధరిల్లిన ఘటనా స్థలం
17 మందికి గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం
గాంధీ ఆస్పత్రికి తరలింపు...ఒకరి మృతి

మెదక్/కొల్చారం:  మరో 20 నిమిషాల్లో గమ్యానికి చేరువలో ఉండగా ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు రక్తంతో  తడిసిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్ని, తండ్రి కొడుకులను చూడలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలతో బయట పడతామా? లేదా? అంటూ ప్రయాణికులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలతో ప్రమాద స్థలి దద్ధరిల్లింది. అతివేగంతో చెట్టును బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ కాలు పూర్తిగా తెగిపోయి తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడింది.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మెదక్-జోగిపేట ప్రధాన రహదారి కొల్చారం మండలం పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు కొల్చారం ఎస్‌ఐ విద్యాసాగర్‌రెడ్డి, ప్రయాణికుల కథనం ప్రకారం  ఇలా ఉన్నాయి. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు (నం.ఏపీ 28జెడ్ 409) సంగారెడ్డి నుంచి మెదక్‌కు సుమా రు 45 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మెదక్ పట్టణానికి 13కిలో మీటర్ల దూరంలో ఉండగా పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో బస్సును అతివేగంగా నడిపించిన డ్రైవర్ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన భూలక్ష్మి కా లు బస్సులోనే తెగిపడింది.

మరో ఐదుగురు రమావత్ కిషన్, సాలి, విఠల్, అజ్మిర, పద్మజల తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం గాంధీకి తరలించారు. ప్రమాదంలో కాలు తెగిపోయిన భూలక్ష్మి(50) గాంధీ ఆస్పత్రికి చేరుకునేసరికే మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివకుమార్, కండక్టర్ నాగరాణిలతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న దుర్గేష్, బేగం, టేక్మాల్ రాజ్, రా మకిష్టయ్య, నవనీత, నిర్మల, మహేష్, యాదమ్మ, మధు, షీలాలతోపాటు మరికొంతమందికి  స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 బిల్లు వచ్చిందని  ఊరెళుతూ మృత్యువాత
మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన మంగళి భూలక్ష్మి తన భర్త, పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వెళ్లింది. గ్రామంలో వారు ఇటీవల నిర్మించుకున్న మరుగుదొడ్డి బిల్లు వచ్చిందని తెలుసుకున్న భూలక్ష్మి శుక్రవారం ప్రమాదానికి గురైన బస్సులో తన స్వగ్రామానికి వెళ్తోంది. మరో 10 నిమిషాల్లో తన స్టేజీ వస్తుందనగా పొతంశెట్టిపల్లి గ్రామశివారులో బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఆమె కాలు తెగిపోయింది. ప్రథమ చికిత్స చేసిన మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలు భూలక్ష్మికి భర్త విఠల్‌తోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని బాధిత కుటుంబీకులు బోరున విలపించారు.

 డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
శుక్రవారం పొతంశెట్టిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శివకుమార్‌దే నిర్లక్ష ్యమని  ప్రయాణికులు తెలిపారు. కేవలం నిద్ర  మత్తులో బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కొల్చారం ఎస్‌ఐ విద్యాసాగర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement