Published
Wed, Jul 20 2016 8:39 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
టీఆర్‌ఎస్‌లో చేరికలు
చౌటుప్పల్ : బంగారు తెలంగాణే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మందోళ్లగూడెం సర్పంచ్ బక్క శంకరయ్య, మాజీ సర్పంచ్ యాట యోగానందంలు బుధవారం ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో సీపీఎం, టీడీపీలకు చెందిన నాయకులు యాట శంకరయ్య, వెంకటేశం, బక్క సురేష్, లింగస్వామి, యాట దాసు, బాలరాజు, రవి, పాపగళ్ల రామచంద్రం, నర్సింహ, ముత్యాలు, యాట నర్సింహ, శివాజీ, హరీష్, పరమేష్, బక్క శేఖర్, మల్లేష్, విష్ణు, విఘ్నేష్, రమేష్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు యాట కృష్ణ, బోరెం శేఖర్‌రెడ్డి, ఇట్టబోయిన శంకరయ్య, యాట లక్ష్మణ్, పోచంపల్లి లవకుమార్, కిషన్, రవికుమార్, రాజు, స్వామి, మల్లారెడ్డి తదితరులున్నారు.