- 2న దేశవ్యాప్త సమ్మె
- సౌత్ సెంట్రల్ జోన్ బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రావు
ఎల్‌ఐసీ శక్తివంతమైన ఆర్థిక సంస్థ
Published Sun, Jul 24 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
హుస్నాబాద్ : దేశంలోని బీమా సంస్థల్లోనే ఎల్‌ఐసీ శక్తివంతమైన ఆర్థిక సంస్థగా అభివృద్ధి చెందుతుందని సౌత్‌సెంట్రల్ జోన్ బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లోని ఎల్‌ఐసీ డివిజన్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీమారంగంలో విదేశీపెట్టుబడులకు వ్యతిరేకంగా ఎల్‌ఐసీ పనిచేస్తుందన్నారు. రూ.27లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉందని తెలిపారు. 2015–16 సంవత్సరానికి ప్రభుత్వ రూ.5కోట్ల పెట్టుబడిపై రూ.1816 కోట్ల డివిడెండ్ చెల్లించి దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడిందన్నారు. ఎల్‌ఐసీని నిర్వీర్యం చేసేందుకు ఇరువై ఏళ్లుగా కుట్రలు జరుగుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం మతం, కులం పేరిట కార్మికుల్లో చిచ్చుపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ప్రధాన మౌలిక డిమాండ్లతో దేశవ్యాప్తంగా అంసఘటిత కార్మికులతో సెప్టెంబర్ 2న సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శి ఎం.రవీందర్, ఎస్.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement