భవిత కోసం బీమా అవసరం
భవిత కోసం బీమా అవసరం
Published Tue, Aug 23 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
రాజానగరం :
సెల్ ఫోన్ కొనడానికి ఇచ్చే ప్రాధాన్యం జీవితానికి ఎవరూ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. భవిష్యత్‌పై ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యాపారానికి జీవిత బీమా సంస్థ రాజానగరానికి ప్రకటించిన ‘బీమా గ్రామ్’ పురస్కారంతో పాటు రూ.లక్ష సాయం చెక్కును గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ ఎం.శ్యామలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సంస్థ ఎస్‌డీఎం రంగారావు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ఒక సంస్థ అభివృద్ధి చెందుతూ ఎటువంటి అవరోధాలు, ఆరోపణలు లేకుండా ముందుకు వెళ్లడం ఒక్క ఎల్‌ఐసీకే సాధ్యమయిందన్నారు. ప్రజల నుంచి వ్యాపారం పొందుతూ వారికి ఏదో విధంగా తోడ్పడేలా బీమాగ్రామ్ వంటి పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్నవారు పన్నుల నుంచి తప్పించుకునేందుకు బీమా చేస్తున్నప్పటికీ, నిజానికి బీమా అవసరం సామాన్యులకే ఎక్కువని, అది గ్రహించక అనుకోని సంఘటనలు జరిగి వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
గ్రామీణాభివృద్ధికే..: గ్రామాల అభివృద్ధిలో ఎల్‌ఐసీ కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ‘బీమా గ్రామ్’ పథకాన్ని తీసుకువచ్చిందని జీవిత బీమా సంస్థ రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ మేనేజర్ జె.రంగారావు అన్నారు. కడియం, సీతానగరం మండలాల్లోని పలు గ్రామాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేశామని సంస్థ రూరల్ మేనేజర్ ఎ.శేషయ్య అన్నారు. ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ అధికారి వై.కాళీవరప్రసాద్, ఎలిపే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు రూప, ఎంపీపీ బచ్చు శ్యామలప్రసాద్, ఉపాధ్యక్షుడు వంక మల్లికార్జునస్వామి, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లాం రత్నం, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు టి. నాగేశ్వర్రావు, మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు ఎంసీహెచ్ వెంకటేశ్వర్రావు, టీడీపీ కన్వీనర్ గంగిశెట్టి చంటిబాబు, ఐసీడీఎస్ సీడీపీఓ వై.సుశీలకుమారి, సర్పంచ్‌లు, కార్యదర్శులు, జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
Advertisement