చిత్తూరు : స్వాతంత్ర దినోత్సవం రోజున మూసి ఉంచాల్సిన మద్యం దుకాణాలు తెరచి ఉంచారు. యధేచ్చగా మద్యం అమ్మకాలు సాగించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి మద్యం విక్రయదారులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.
ఈ సంఘటన చిత్తూరు జిల్లా నారాయణవనంలోని స్థానిక వైన్స్ షాపు వద్ద శనివారం చోటు చేసుకుంది. షాపులో పని చేస్తున్న ముగ్గరు వ్యక్తులు మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నారు. ధర్మరాజు ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో మద్యం కోసం జనాలు బారులు తీరారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ విషయం తెలిసిన షాపులోని వ్యక్తులు దుకాణం మూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.