విశాఖపట్నం: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వివరాలు.. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన వారణాసి సూర్యలక్ష్మి (52) వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి కిందపడింది.
దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆమెకు బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె అవయవాలు దానం చేయాలని సూర్యలక్ష్మీ భర్త రమణమూర్తి నిర్ణయించారు. ఆ విషయాన్ని ఆయన వైద్యులకు వెల్లడించారు. అయితే హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కాలేయం అవసరమైంది.
ఈ విషయాన్ని యశోదా వైద్యులు కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులకు తెలిపారు. దాంతో స్థానిక మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఆమె అవయవాలను సేకరించి హైదరాబాద్కు కాలేయాన్ని ఇండిగో ఫ్లైట్లో తరలించారు.