అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ దగ్ధం | lorry burnt accidentally at national highway 44 | Sakshi
Sakshi News home page

అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ దగ్ధం

Published Wed, May 18 2016 7:53 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

lorry burnt accidentally at national highway 44

అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఎల్అండ్టీ టోల్ ప్లాజా వద్ద బుధవారం వేకువజామున ఒక లారీ దగ్ధమైంది. రాజస్థాన్ నుంచి చెన్నైకి బ్లీచింగ్ పౌడర్ లోడుతో వెళుతున్న ఆర్‌జే08జిఏ7509 నంబరు గల లారీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

టోల్ ప్లాజా వద్ద మూత్ర విసర్జనకు లారీని ఆపిఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన ఎల్ అండ్ టి సిబ్బంది పోలీసులకు, పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే లారీ పూర్తిగా దగ్ధమైన తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement