లక్కీడిప్ నిర్వాహకుల అరెస్టు
– రూ.1.25 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో
ఓర్వకల్లు: సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్కీడిప్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఇన్‌చార్జ్ డీఎస్పీ వినోద్‌కుమార్, తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్ బుధవారం ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని సోమయాజులపల్లె పరిసర ప్రాంతాల్లో గత కొన్ని నెలల నుంచి లక్ష్మీసాయి ఎంటర్ ప్రైజేస్ పేరుతో లక్ష్మి బంపర్ డ్రాను ఏర్పాటు చేశారు. డ్రాలో పేరు వచ్చిన వారికి విలువైన బహుమతులు ఇస్తామని ఆశపెట్టి ప్రజల నుంచి నెలవారి కంతుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దీంతో ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉల్లిందకొండ, నాగలాపురం ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మండలంలోని సోమయాజులపల్లె, ఓర్వకల్లు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో లక్కీ డిప్ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులు, ఆధారాలు లభించాయి. సోమయాజులపల్లె గ్రామానికి చెందిన డిప్ నిర్వాహకులు వీరభద్రాచారి అలియాస్ భద్రి, మహేశ్వరరెడ్డి, చెన్నంచెట్టిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు, తిప్పాయిపల్లె శంకర్, ఆ సంస్థ ఓర్వకల్లు ఏజెంట్ గోపాల్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుంచి రూ. 1.25 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు సా్వధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే మండలంలో ప్రాతిని«ధ్యం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అండదండలతో ఈ లక్కీడిప్ నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.