పగిడ్యాలః కర్నూలు జిల్లా ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురంలో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు..పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మాదవి(29)కి మిడుతూరు గ్రామానికి చెందిన మల్లయ్య(35)తో పదేళ్ల క్రిందట పెళ్లి జరిగింది. అప్పటి నుంచి మల్లయ్య భార్యపై అనుమానం పెంచుకొని చిత్రహింసలకు గురిచేయగా కులపెద్దలు పంచాయతీ నిర్వహించి భార్య ఊరిలోనే కాపురం పెట్టాలని చెప్పడంతో ఏడాది నుంచి భార్యభర్తలు లక్ష్మాపురంలోనే నివాసం ఉంటున్నారు.
అయినా మల్లయ్య ప్రవర్తనలో మార్పు రాకపోకపోవడంతో పాటు మరింత అనుమానం పెంచుకొని ఈ రోజు మాదవిపై కొడవలితో విచక్షణరహితంగా దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకునేలోగానే రక్తమడుగులో కొట్టుకుంటున్నా భార్యను వదిలి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై హత్యాయత్నం కింద చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు.
అనుమానంతో భార్య గొంతుకోశాడు!
Published Wed, Sep 16 2015 7:13 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM
Advertisement
Advertisement