బాలికపై లైంగికదాడి: యువకుడికి దేహశుద్ధి | Man arrested in connection with sexual assault on girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి: యువకుడికి దేహశుద్ధి

Published Tue, Jul 26 2016 3:53 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

Man arrested in connection with sexual assault on girl

కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో పదేళ్ల బాలికపై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడిన విషయం మంగళవారం వెలుగు చూసింది.

సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో పదేళ్ల బాలికపై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడిన విషయం మంగళవారం వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పొరుగింట్లో ఉన్న రవి(22) అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం యువకుడు బెదిరించడంతో బాలిక విషయం ఎవరికీ చెప్పలేదు. నాలుగు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడి జరిగిందని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో బాలిక తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్‌కు విషయం తెలియజేశారు. గ్రామస్తులు నిదితుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. సారంగపూర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement