
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శింగనమల : లోలూరు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. 35 సంవత్సరాల వయసు కలిగిన ఈ వ్యక్తి నీలం రంగు జీన్స్ ప్యాంటు, పసుపుపచ్చగీతలు కలిగిన నీలం రంగు షర్టు ధరించాడు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ నబీరసూల్‌లు ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకున్నారు. జనం కూడా గుమిగూడారు. దీంతో కొంతమేర వాహనాలు నిలిచిపోయాయి.
స్కూటర్‌ను ఢీకొన్న కంటైనర్
ప్రమాద ఘటనలో జనం గుమిగూడి ఉండగా ఉదయం ఏడుగంటల సమయంలో బొలెరో వాహనం ముందు ఉన్న స్కూటర్‌ను మైసూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న కంటైనర్ వాహనం ఢీకొంది. స్కూటర్‌లోని వ్యక్తికి, బొలెరోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేయించుకుని వెళ్లినట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.