అద్దె అడిగితే చంపేస్తా... | man escape rental and threatning the owner | Sakshi
Sakshi News home page

అద్దె అడిగితే చంపేస్తా...

Published Sun, Sep 25 2016 11:12 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

man escape rental and threatning the owner

మెహిదీపట్నం: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి యజమానిని చంపేస్తానని బెదిరించాడో వ్యక్తి. బాధితుడి ఫిర్యాదు మేరకు హుమాయూన్ నగర్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇన్ స్పెక్టర్‌ సూరపల్లి రవీందర్‌ కథనం ప్రకారం...శాలిబండకు చెందిన మహ్మద్‌ తాఫీ అస్గర్‌ విజయనగర్‌కాలనీ ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిని మహ్మద్‌ అలీ ఇస్లామికి ఏడాది క్రితం అద్దెకిచ్చాడు.

నాలుగు నెలలుగా ఇస్లామి అద్దె చెల్లించకపోగా రూ.10 లక్షలు ఇస్తేనే గది ఖాళీ చేస్తా, లేకపోతే చంపేస్తానని ఇంటి యజమానిని బెదిరించాడు. భయాందోళనకు గురైన అస్గర్‌ హుమాయూన్ నగర్‌ పోలీసులకు ఇస్లామిపై ఫిర్యాదు చేశాడు  కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్లామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement