భూమి కోసం దళితుడి నిరసన | man strikes for land | Sakshi
Sakshi News home page

భూమి కోసం దళితుడి నిరసన

Published Wed, Apr 5 2017 11:02 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM

భూమి కోసం దళితుడి నిరసన - Sakshi

భూమి కోసం దళితుడి నిరసన

అమడగూరు (పుట్టపర్తి) : తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన నరసింహులు అనే దళితుడు బుధవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా 414 సర్వే నెంబరులోని నాలుగు ఎకరాల భూమి తన ఆధీనంలో ఉందన్నారు. పాస్‌పుస్తకం కూడా తన పేరుమీదే ఉందన్నారు. అయితే తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండా అతని పాస్‌పుస్తకంలో ఈ భూమిని ఎక్కించుకున్నారని ఆవేదన చెందారు. పై అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని విచారం వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement